టీవీ9 రవి ప్రకాష్ న్యాయవాది ఇంట్లో సోదాలు .. పలు కీలక ఆధారాలు లభ్యం.. న్యాయవాదిపై అభియోగాలు

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌‌, శివాజీలపై తెలంగాణా పోలీసుల ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. . విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న రవి ప్రకాష్, శివాజీలపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే . ఇక ఇదే సమయంలో ఇప్పటి వరకు పోలీసుల ముందు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న శివాజీ ఒక వీడియో విడుదల చేశారు. తానేమీ తప్పు చెయ్యలేదని, తాను ఎక్కడికీ పారిపోలేదాని, మూడు, నాలుగు రోజుల్లో బయటకు వస్తానని అప్పుడు అందరి సంగతి చూస్తానని పేర్కొన్నారు.

ఇక ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు తాజాగా రవి ప్రకాష్ లాయర్ పై కూడా సైబరాబాద్ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. రవిప్రకాశ్ న్యాయవాది జె.కనకరాజు నివాసంలో సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది .వాటిలో చానల్ యాజమాన్య మార్పుకు సంబంధించిన ఫోర్జరీ డాక్యుమెంట్లు కూడా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.

Ravi Prakashs lawyer has several key sources of evidence in the house.. The lawyer is charged

లభించిన కీలక ఆధారాలను బట్టి ఫోర్జరీ పత్రాలను తయారుచేయడంలో రవిప్రకాశ్ కు తోడ్పడ్డారని న్యాయవాది కనకరాజుపైనా పోలీసులు అభియోగాలు మోపారు. ఇక ఈ కేసులో న్యాయవాదిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+