పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న రవి ప్రకాష్ ..నేడు సైతం కొనసాగనున్న విచారణ
Recommended Video
టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ నాలుగు రోజులుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. గడిచిన నాలుగు రోజుల విచారణలో ఆయన ఏమాత్రం పోలీసులకు సహకరించలేదని తెలుస్తుంది. ఫోర్జరీ, నిధుల మళ్లింపు, లోగో విక్రయం కేసులో రవి ప్రకాష్ నుంచి కీలక ఆధారాలను రాబట్టడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఆయనపైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయినప్పటికీ రవి ప్రకాష్ మాత్రం పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదు.

పోలీసులకు చుక్కలు చూపిస్తున్న రవి ప్రకాష్ .. నేడు కూడా కొనసాగనున్న విచారణ
గడచిన నాలుగు రోజుల విచారణలో పోలీసులు మొత్తం విచారణను వీడియో రికార్డింగ్ చేశారు. రవిప్రకాష్ కు పెన్ను, పేపర్ ఇచ్చి గంట పాటు ఆయన చేతి రాతను పరిశీలించారు. ఆయన మానసిక స్థితిని అంచనా వేశారు . ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో రవి ప్రకాష్ చేతిరాతను సేకరించిన పోలీసులు దర్యాప్తులో సేకరించిన పత్రాలను ఎఫ్ ఎస్ ఎల్ కు పంపారు. శుక్రవారంనాడు కూడా పోలీసులు ఏడుగంటలపాటు రవి ప్రకాష్ ను విచారించారు. కానీ ఆయన శుక్రవారంనాడు కూడా పోలీసులకు సహకరించకుండా పొంతన లేని సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక దీంతో ఈ కేసుకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను సేకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు నేడు కూడా రవి ప్రకాష్ ను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించినట్లుగా తెలుస్తుంది.

రవి ప్రకాష్ ను పట్టుకోవటంలోనూ .. విచారణలోనూ ఫెయిల్ అవుతున్న పోలీసులు
మొన్నటి వరకు రవిప్రకాష్ ఎక్కడున్నాడో పట్టుకోలేకపోయిన పోలీసులు ఇప్పుడు రవిప్రకాశ్ విచారణకు స్వయంగా హాజరవుతున్న ప్పటికీ ఆయన నుంచి సరైన వివరాలు మాత్రం రాబట్టలేక పోతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు రవి ప్రకాష్ ను అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నప్పటికీ రవి ప్రకాష్ మాత్రం సరైన సమాధానాలు ఇవ్వడం లేదని పోలీసులు భావిస్తున్నారు. టీవీ9 లోగోను 99 వేలకు విక్రయించడం లో ఉన్నా నిజమెంత? రవిప్రకాష్ కు, శివాజీ కి మధ్య ఒప్పందమేంటి? టీవీ9 నుంచి నిధుల మళ్లింపు ఏ విధంగా చేశారు? ఎన్ని రోజులు రవిప్రకాశ్ అక్కడ తలదాచుకున్నారు వంటి అనేక అంశాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రవిప్రకాష్ సహకరించకపోవటంతో పోలీసులకు తలనొప్పిగా మారిన కేసు
ఆయన చెప్పిన సమాధానాలను ఒకదానితో ఒకటి పోల్చి ఆయన చెబుతున్న వివరాలు వాస్తవాలు అవునా కాదా అన్న అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రవి ప్రకాష్ నుండి పోలీసులు మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇక నేడు మరోమారు విచారణ కొనసాగుతున్న తరుణంలో రవి ప్రకాష్ పోలీసులకు మరింత చుక్కలు చూపించనున్నాడో మరి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications