తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, విద్యుత్‌పై చర్చకు నేను రెఢీ: రేవంత్‌కు సుమన్ సవాల్

హైదరాబాద్: విద్యుత్ అంశంపై చర్చకు తాము సిద్దమని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ చెప్పారు.విద్యుత్ అంశంపై మేం చెప్పేది తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని బాల్క సుమన్ సవాల్ విసిరారు.

విద్యుత్ అంశంపై టిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ప్రకటించారు. దివాళా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్దమని కూడ ఆయనప్రకటించారు.

రేవంత్ వ్యాఖ్యలపై టిఆర్ఎస్ బుదవారం నాడు స్పందించింది. టిఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ రేవంత్ విమర్శలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.విద్యుత్ అంశంపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని బాల్క సుమన్ ప్రకటించారు.

విద్యుత్ పై చర్చకు సిద్దం

విద్యుత్ పై చర్చకు సిద్దం

విద్యుత్‌పై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని టిఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ చెప్పారు.విద్యుత్‌పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు.టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ ముందుచూపు కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ మిగులులోకి వచ్చిందని బాల్క సుమన్ చెప్పారు.

ముక్కు నేలకు రాస్తా

ముక్కు నేలకు రాస్తా

విద్యుత్ విషయమై తాము చెప్పేది అబద్దమని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ చెప్పారు.కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అవాస్తవమని తేలితే అబిడ్స్‌లో ముక్కు నేలకు రాస్తారా అని బాల్క సుమన్ సవాల్ విసిరారు.

చర్చకు సమయం, తేది రేవంత్ చెప్పాలి

చర్చకు సమయం, తేది రేవంత్ చెప్పాలి

విద్యుత్ విషయంలో చర్చకు తాను సిద్దంగా ఉన్నానని బాల్క సుమన్ చెప్పారు. అయితే చర్చకు సమయం , తేదిని రేవంత్ రెడ్డి చెప్పాలని బాల్క సుమన్ చెప్పారు.ఎప్పుడైనా చర్చకు సిద్దమని బాల్క సుమన్ చెప్పారు.

కెసిఆర్ ను సన్మానించేందుకు రెడీ కావాలి

కెసిఆర్ ను సన్మానించేందుకు రెడీ కావాలి

తెలంగాణలో కెసిఆర్ ముందు చూపు కారణంగానే మిగులు విద్యుత్ దిశగా తెలంగాణ రాష్ట్రం సాగుతోందని బాల్క సుమన్ చెప్పారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో 15 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని సాధించనున్నట్టు బాల్క సుమన్ చెప్పారు. భూపాలపల్లి, ఆర్ టీ పీపీలో ఒకేసారి పనులు ప్రారంభమైనా భూపాలపల్లిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. కానీ, ఆర్ టీ పీపీలో ఎందుకు ప్రారంభం కాలేదని బాల్క సుమన్ ప్రశ్నించారు.

జానా, ఉత్తమ్ తో వచ్చినా అభ్యంతరం లేదు

జానా, ఉత్తమ్ తో వచ్చినా అభ్యంతరం లేదు

విద్యుత్ విషయమై చర్చకు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి రేవంత్ రెడ్డి వచ్చినా తనకు అభ్యంతరం లేదని బాల్క సుమన్ ప్రకటించారు. విద్యుత్ పై కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి చెబుతున్నదంతా అబద్దమని నిరూపించేందుకు తాను సిద్దమని బాల్క సుమన్ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+