హైదరాబాద్ లో ఎకరం రూ. 177 కోట్లు.. ఆ ఏరియాలో భూమి ధరలకు రెక్కలు ..?
హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెందుతూ విశ్వ నగరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ది చెందుతోంది. తాజాగా TGIIC నిర్వహించిన భూ వేలంలో రాయదుర్గంలోని భూమికి రికార్డు ధర పలికింది. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వేలం వేయగా ఎకరం ఏకంగా రూ. 177 కోట్లు పలికింది. ఈ వేలంలో పాల్గొన్న ఎంఎస్‌ఎన్ రియాలిటీ సంస్థ అత్యధిక ధరతో 7.67 ఎకరాల భూమిని సొంతం చేసుకుంది. ఇందుకుగాను ఎకరాకు రూ. 177 కోట్ల చొప్పున మొత్తం రూ. 1,357 కోట్లు చెల్లించింది. మరో 11 ఎకరాలకు వేలం కొనసాగుతున్నట్లు సమాచారం అందుతోంది. గతంలో కోకాపేటలో ఎకరా రూ.100 కోట్లకు అమ్ముడైన విషయం తెలిసిందే.
హైదరాబాద్ రాయదుర్గంలోని ప్రభుత్వ స్థలాన్ని టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్) వేలం వేసింది. అయితే రికార్డు స్థాయిలో ఎకరం ఏకంగా రూ. 177 కోట్లు పలికింది. ఈ వేలంలో పాల్గొన్న ఎంఎస్‌ఎన్ రియాలిటీ సంస్థ అత్యధిక ధరతో 7.67 ఎకరాల భూమిని అత్యధిక ధరకు సొంతం చేసుకుంది. ఎకరాకు రూ. 177 కోట్ల చొప్పున మొత్తం రూ. 1,357 కోట్లు చెల్లించింది. మరోవైపు తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్లాట్ల విక్రయాల్లోనూ రికార్డు ధర నమోదైంది. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ లో చదరపు గజం రూ. 1.14 లక్షలు పలికింది.

ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్ సిటీలోని పలుచోట్ల భూముల వేలానికి సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల బిడ్ దాఖలుకు అక్టోబరు 1 సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చింది. అక్టోబరు 4వ తేదీ వరకు ల్యాండ్ విజిటింగ్ కు సమయం ఇచ్చింది. అక్టోబరు 6న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేలం వేశారు.












Click it and Unblock the Notifications