రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు: ప్రేమోన్మాది ఘాతుకం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ మండలం రావల్‌కోల్‌లో ఎర్రచందనం స్మగ్లర్‌ బూడూరు మాధవరెడ్డిని పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు. ఆయన వద్ద నుంచి 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మాధవరెడ్డిని పట్టుకొని నెల్లూరుకు తరలించారు. గతరాత్రి మాధవరెడ్డిని పట్టుకునేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నించగా దోపిడీ దొంగలు తనను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారని మీడియాను, పోలీసులను మాధవరెడ్డి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.

తనను యువతి ప్రేమించలేదని ఓ యువకుడు యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించిన సంఘటన హైదరాబాద్‌ నగరంలో శుక్రవారం ఉదయం జరిగింది. సైదాబాద్‌లోని వినయ్‌నగర్‌లో ఓ యువకుడు యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. అనంతరం యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Red sanders smuggler arrested in Ranga Reddy district

పెళ్లి వాహనం బోల్తా, ఒకరి మృతి

రంగారెడ్డి శంకర్‌పల్లి మండలం పొద్దుటూరులో విషాదం అలముకుంది. పెళ్లి వాహనం బోల్తా పడి ఒకరు మరణించారు. ఈ సంఘటనలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

తల్లిని చంపిన కొడుక్కి జైలు

తల్లిని చంపిన కొడుకుకు జీవిత కాలం శిక్ష విధిస్తూ ఎల్‌బీనగర్‌ 13వ ఏడీజే (అడిషనల్‌ డిస్ర్టిక్‌ జడ్జి) తీర్పు ఇచ్చారు. సికింద్రాబాదులోని నేరేడ్‌మెట్‌ డిఫెన్స్‌ కాలనీలో నివసించే రాధాకృష్ణమూర్తి, కవితల కుమారుడు సుధీర్‌ ఆస్తి కోసం తల్లిని హత్య చేశాడు. 2012లో నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గురువారం కేసు విచారణ అనంతరం సుధీర్‌కు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబు తెలిపారు.

English summary
Red sanders smuggler Madhav Reddy has been arrested in Rangareddy district of Telangana and shifted to Nellore of Andhra Pradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X