మహిళ ప్రాణం తీసిన రిఫ్రిజిరేటర్ డోర్.. ఫ్రిజ్ వాడకంలో ఈ పొరబాట్లు చెయ్యొద్దు!

ఏం కాదులే అని మనం చేసే చిన్న నిర్లక్ష్యం ఒక్కోసారి మన ప్రాణాల మీదకు తెస్తుంది. ఇంట్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఒక్కోసారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తాజాగా అటువంటి ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రిఫ్రిజిరేటర్ డోర్ తీసిన ఒక మహిళ విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలను కోల్పోయింది.

రిఫ్రిజిరేటర్ డోర్ ఓపెన్ చేయగా కరెంట్ షాక్
ఇక ఈ కేసు వివరాల్లోకి వెళితే హైదర్ గూడా, ఎర్రబోడకు చెందిన లావణ్య అనే మహిళకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భర్త పదేళ్లక్రితం మృతి చెందాడు. ఆమె ఇళ్ళలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. గతేడాది తన పెద్దకుమార్తె వివాహం చేసింది. ఆమెకు ప్రసవం కాగా ప్రస్తుతం పెద్దకూతురు కూడా లావణ్య ఇంట్లోనే ఉంటుంది. నిన్న ఉదయం లావణ్య రిఫ్రిజిరేటర్ డోర్ ఓపెన్ చేయగా ఒక్కసారిగా విద్యుత్ ఘాతానికి గురైంది.

Refrigerator door that took a woman s life Don t make these mistakes when using the fridge

ఆస్పత్రికి తరలించే లోపే లావణ్య మృతి
కరెంట్ షాక్ కొట్టడంతో పెద్దగా కేకలు వేస్తున్న లావణ్యను కాపాడాలని ఆమె పెద్ద కూతురు ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు. స్థానికుల సహాయంతో లావణ్యను వెంటనే హైదర్ గూడాలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రిజ్ కు ఎర్తింగ్ లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

రిఫ్రిజిరేటర్ లకు ఎర్త్ లేకుంటే కష్టమే
మనలో చాలామంది రిఫ్రిజిరేటర్ లను వినియోగించేవారు వాటి నిర్వహణ విషయంలో చాలా అశ్రద్ధ ని చూపిస్తారు కానీ అది ఏమాత్రం మంచిది కాదు. రిఫ్రిజిరేటర్ లను సరిగా నిర్వహించకపోతే విద్యుత్ షాక్ కు గురయ్యే ప్రమాదం ఉంది. రిఫ్రిజిరేటర్ లకు ఎర్త్ లేకపోయినా, ఇంట్లో విద్యుత్ నిర్వహణకు సంబంధించి ఎర్త్ లేకపోయినా ఈ విధంగా వస్తువులలోకి ఎలక్ట్రిసిటీ వచ్చే అవకాశం ఉంది.

ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టంలో ఎర్తింగ్ ఉండాలి
కాబట్టి ఇంటికి ఎర్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరిగా ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టంలో ఎర్తింగ్ ఉండేలా చూసుకోవాలి. ఇక రిఫ్రిజిరేటర్ ప్లగ్, పవర్ కార్డు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. వైర్లు కట్ అయినా, ప్లగ్ వదులుగా ఉన్నా వెంటనే మార్చుకోవాలి. రిఫ్రిజిరేటర్ వెనుక భాగం కాస్త గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. కంప్రెషర్ వద్ద లోహపు వస్తువులు తగలకుండా చూసుకోవాలి.

ఫ్రిజ్ విషయంలో ఈ జాగ్రత్తలు అవసరం
రిఫ్రిజిరేటర్ వినియోగించేవారు ఎక్స్టెన్షన్ వైర్లు వాడడం మంచిది కాదు. ఫ్రిజ్ ను శుభ్రం చేసేటప్పుడు ప్లగ్ తీసివేసి శుభ్రం చేసుకోవాలి. తడి చేతులతో రిఫ్రిజిరేటర్ ను కానీ పవర్ ప్లగ్ ను గాని తాకటం మంచిది కాదు. కాబట్టి ఈ జాగ్రత్తలను పాటించినట్లయితే ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవడానికి వీలవుతుంది. అందుకే రిఫ్రిజిరేటర్ ల వినియోగం విషయంలో పైన చెప్పినటువంటి దుర్ఘటనలు జరగకుండా బి కేర్ ఫుల్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+