హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీసీపై పోరాటం ఆగదు: జైలు నుంచి విడుదలైన హెచ్‌సీయూ విద్యార్థులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ)లో అరాచకాలకు తెరలేపిన వీసీ అప్పారావును తొలగించే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని విద్యార్థి సంఘం నేతలు ప్రశాంత్‌, వెంకటేశ్‌ చౌహాన్‌లు మంగళవారం రాత్రి స్పష్టం చేశారు. చర్లపల్లి జైలు నుంచి బెయిలుపై విడుదలైన వీరు విద్యార్థులతో కలసి మీడియాతో మాట్లాడారు.

తమను 36 గంటల పాటు ఆరు పోలీస్ స్టేషన్లకు తిప్పారని, మానవ హక్కులను ఉల్లంఘిస్తూ కొట్టారని తెలిపారు. ఎస్సైలు నవీన్‌, భూపతి, లాల్‌మదార్‌లు ఇష్టానుసారం ప్రవర్తించారని ఆరోపించారు. అప్పారావు వీసీ కాకముందు నుంచే విద్యార్థులను వేధిస్తున్నారని ప్రొఫెసర్‌ ఏసురత్నం చెప్పారు.

వీసీ మీద కేసులున్నా ఎలా కొనసాగుతున్నారో అర్థం కావడంలేదని రోహిత్‌ తల్లి రాధిక అన్నారు. 26మంది విద్యార్థులు, ఇద్దరు ప్రొఫెసర్లు ఏసురత్నం, తథాగత్‌లను తీసుకెళ్లేందుకు విద్యార్థి నేతలు మంగళవారం ఉదయమే చర్లపల్లి జైలు వద్ద రెండు బస్సులను ఉంచారు. పూచీకత్తు అంశాలపై స్పష్టత రాకపోవడతో రాత్రి వరకూ వారు జైల్లోనే ఉన్నారు. న్యాయవాదులు మళ్లీ బెయిలు పత్రాలను తీసుకురావడంతో రాత్రి 9.30 గంటలకు విడుదల చేశారు.

సాధారణ పరిస్థితులకు సూచనలివ్వండి: వీసీ

హెచ్‌సీయూలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు విద్యార్థులు సూచనలు, సలహాలివ్వాలని వీసీ అప్పారావు కోరారు. వర్సిటీ ప్రాంగణంలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను విద్యార్థులు సూచించవచ్చని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

విద్యార్థులు తమ పేరు, కోర్సు వివరాలను తెలియజేస్తూ లిఖితపూర్వకంగా సలహాలను సంబంధిత వార్డెన్లు లేదా విభాగాధిపతులకు సమర్పించవచ్చన్నారు. మెయిల్‌ ద్వారా కూడా పంపవచ్చని సూచించారు. విద్యార్థుల సూచనలను సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ)లో అరాచకాలకు తెరలేపిన వీసీ అప్పారావును తొలగించే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని విద్యార్థి సంఘం నేతలు ప్రశాంత్‌, వెంకటేశ్‌ చౌహాన్‌లు మంగళవారం రాత్రి స్పష్టం చేశారు.

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

చర్లపల్లి జైలు నుంచి బెయిలుపై విడుదలైన వీరు విద్యార్థులతో కలసి మీడియాతో మాట్లాడారు.

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

తమను 36 గంటల పాటు ఆరు పోలీస్ స్టేషన్లకు తిప్పారని, మానవ హక్కులను ఉల్లంఘిస్తూ కొట్టారని తెలిపారు. ఎస్సైలు నవీన్‌, భూపతి, లాల్‌మదార్‌లు ఇష్టానుసారం ప్రవర్తించారని ఆరోపించారు.

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

అప్పారావు వీసీ కాకముందు నుంచే విద్యార్థులను వేధిస్తున్నారని ప్రొఫెసర్‌ ఏసురత్నం చెప్పారు. వీసీ మీద కేసులున్నా ఎలా కొనసాగుతున్నారో అర్థం కావడంలేదని రోహిత్‌ తల్లి రాధిక అన్నారు.

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

26మంది విద్యార్థులు, ఇద్దరు ప్రొఫెసర్లు ఏసురత్నం, తథాగత్‌లను తీసుకెళ్లేందుకు విద్యార్థి నేతలు మంగళవారం ఉదయమే చర్లపల్లి జైలు వద్ద రెండు బస్సులను ఉంచారు.

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

పూచీకత్తు అంశాలపై స్పష్టత రాకపోవడతో రాత్రి వరకూ వారు జైల్లోనే ఉన్నారు.

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

న్యాయవాదులు మళ్లీ బెయిలు పత్రాలను తీసుకురావడంతో రాత్రి 9.30 గంటలకు విడుదల చేశారు.

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

కాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రశాంతత నెలకొనేలా విద్యార్థులు, అధ్యాపకులతో సమన్వయ కమిటీని నియమించాలని హైకోర్టులో మంగళవారం ప్రొఫెసర్ వినోద్‌కుమార్ ‘పిల్' (ప్రజా ప్రయోజన వాజ్యం) దాఖలు చేశారు.

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

దీంతో హెచ్‌సియు వీసీ, రిజిస్ట్రార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్, విద్యార్థి సంఘాల నేతలకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

హెచ్‌సీయూ విద్యార్థుల రిలీజ్

పూర్తి వివరాలతో ప్రమాణపత్రం సమర్పించాలని స్పష్టంచేస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరాం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.

English summary
The 25 students and two professors of University of Hyderabad, who were released from Cherlapally Central Prison on Tuesday night, threatened to intensify the protests demanding arrest of persons who are responsible for death of research scholar Rohith Vemula.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X