తెలంగాణకు సుప్రీంకోర్టులో రిలీఫ్: పాలమూరు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్, 500 కోట్ల జరిమానాపై స్టే
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతిచ్చింది.
హైదరాబాద్: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతిచ్చింది. పర్యావరణ అనుమతులు 7.15 టీఎంసీల ఉపయోగించుకోవడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే, తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని సర్వోన్నత న్యాయ స్థానం స్పస్టం చేసింది. ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కోకుండా.. ఇబ్బందులకు గురికాకూడదన్న ఉద్దేశంతో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ సంజవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది.

మరోవైపు, పాలమూరు-రంగారెడ్డిపై ఎన్జీటీ జరిమానా విధిస్తూ.. ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు సవాల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింంది. ఈ కేసులో ఉన్న ప్రతివాదులందరికీ సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆరువారాల్లో ప్రతివాదులు అంతా.. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, ఆ తర్వాత ఆరువారాల్లో వాటికి సమాధానంగా రిజాయిండర్లు దాఖలు చేయాలని పటిషనర్ ను ఆదేశించింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని జాతీయ హరిత ట్రైబ్యునల్ విధించిన రూ. 500 కోట్ల జరిమానాపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి విచారణను ఆగస్టులో చేపట్టనున్నట్లు తెలిపింది.
కాగా, 35,200 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో 1.5 శాతం అంటే రూ. 528 కోట్ల పర్యావరణ పరిహారాన్ని విధిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.












Click it and Unblock the Notifications