వారికి ఉపాధి.. మూసీ నిర్వాసితుల కోసం రేవంత్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ మూసి విషయంలో ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలాగా మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మూసి నిర్వాసితులకు అండగా ఉంటామని, బఫర్ జోన్ లో ఇళ్ళు ఉన్న వాళ్లకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తామని కీలక ప్రకటన చేస్తున్న రేవంత్ రెడ్డి త్వరలో మూసి అంశం పైన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

మూసీ నిర్వాసితుల కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
ఇక తాజాగా మూసి పరివాహక ప్రాంత నిర్వాసితులకు ఇళ్లతో పాటు జీవనోపాధి కల్పించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.మూసీ నది నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి మూసి బాధితులకు ఏ విధంగా ఉపాధి కల్పించవచ్చు అన్నదానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Revanth government sensational decision for Musi residents livelihood Along with houses

వారికి ఉపాధి
సెర్ఫ్ సీఈవో చైర్మన్ గా, 14 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కమిటీ మూసి బాధితులకు ఉపాధి కల్పించడం పైన ఉన్న అవకాశాలను పరిశీలించి, చర్చించి ప్రభుత్వానికి ఒక నివేదికను అందిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా వారికి జీవనోపాధిని కూడా కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

గట్టిగా ప్లాన్ చేస్తున్న రేవంత్ రెడ్డి
ఒకపక్క బి ఆర్ ఎస్ మూసీ పరివాహక ప్రాంతాలలో కూల్చివేతలను అడ్డుకుంటామని ప్రకటించిన వేళ గతంలో బిఆర్ఎస్ హయాంలో మూసి ఆక్రమణలు తొలగించడానికి సిద్ధమైన విషయాన్ని ప్రజలలో చర్చకు పెట్టిన కాంగ్రెస్ బీఆర్ఎస్ దూకుడుకు బ్రేక్ వేసే పనిలో ఉంది. మూసి పరివాహ ప్రాంతాలలో కూల్చివేతలపైన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్న వేళ వారిని శాంతింప చేసేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.

మూసీ విషయంలో తగ్గేదేలేదంటున్న రేవంత్
అయితే మూసి ప్రక్షాళన విషయంలో, మూసీ బ్యూటిఫికేషన్ విషయంలో అసలు తగ్గేదే లేదని తేల్చి చెబుతున్నారు. మూసి పరివాహక ప్రాంతాల ప్రజల సహకారంతోనే కూల్చివేతలను కొనసాగించాలని, వారికి అండగా ఉండేందుకు రకరకాల నిర్ణయాలను తీసుకుంటున్న రేవంత్ రెడ్డి తాజాగా వారికి జీవనోపాధి కల్పించే విషయం పైన కమిటీని వేయడం గమనార్హం.

మూసీ ప్రక్షాళనపై ఏం జరుగుతుందో?
తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ యుద్ధానికి కారణమైన మూసి రగడ పైన జరుగుతున్న తాజా పరిణామాలతో ముందు ముందు ఈ వ్యవహారంలోన ఏం జరగబోతుంది అన్నది ఆసక్తిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+