Revanth Reddy: ప్రవళిక మృతిపై కవిత టార్గెట్‍గా రేవంత్ విమర్శలు..

నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్య బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. ప్రతిపక్షాలు ముకుమ్ముడిగా బీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నాయి. నిజానికి టీఎస్పీఎస్సీ తీరు మొదటి నుంచి వివాదాస్పందగానే ఉంది. ముఖ్యంగా గ్రూప్-1 పేపర్ లీకేజీ, ఏఈ పేపర్ లీకేజీతో టీఎస్పీఎస్సీ పరువు మొత్తం పోయింది. ఆ తర్వాత గ్రూప్-1 పరీక్ష సరిగా నిర్వహించలేదు. దీంతో హైకోర్టు గ్రూప్-1 పరీక్షను రద్దు చేసింది. అంతకు ముందు టీఎస్పీఎస్సీ గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసింది. ఇక గ్రూప్-4 పరీక్ష నిర్వహించగా.. ఇంకా ఫలితాలు వెల్లడించలేదు.

తాజాగా డీఎస్సీ కూడా వాయిదా వేయడంతో నిరుద్యోగులు ఆవేదనతో ఉన్నారు. ఈ క్రమంలో ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ప్రవళిక ఆత్మహత్యపై జాతీయస్థాయి నేతలు కూడా స్పందిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ప్రవళిక ఆత్మహత్య పై స్పందించారు. ఆయన ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. బతుకమ్మ సంబరాల గురించి రంగురంగుల వీడియోలు పెట్టే ఎమ్మెల్సీ కవితకు గ్రూప్ పరీక్షల నిర్వహణ అవకతవకలతో బతుకు భారమై, భవిత ఆగమై ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక ఆత్మ ఘోష వినబడటం లేదా అని ట్విట్టర్ లో నిలదీశారు.

Revanth made many criticisms on Pravilikas death as a target of Kavita

ఆడబిడ్డల హక్కులు మీ దృష్టిలో రాజకీయ అంగడి సరుకే తప్ప.. పొలిటికల్ స్లోగన్లు తప్ప మానవీయ ఎజెండాలు కాదని రేవంత్ ఆరోపించారు.బతుకమ్మ ఆడబిడ్డల ఆత్మీయ సంగమం. మన తెలంగాన ఆత్మగౌరవ సంబంరం. బతుకమ్మ శుభాకాంక్షలతో ఈ ఏడాది బతుకమ్మ పాటలు మీకోసం అంటూ ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోను రేవంత్ తన రీ ట్వీట్ చేశారు. వరంగల్ జిల్లా బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన మర్రి లింగయ్య, విజయ దంపతులు కుమార్తె ప్రవళిక పోటీ పరీక్షల కోసం హైదరాబాద్ కు వచ్చింది.

ప్రవళిక హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని బృందావన్ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్ 2 ప‌రీక్ష‌ల కోసం ఎన్నోఏళ్లుగా సిద్ధమవుతోంది. ప్రవళిక శుక్రవారం హాస్ట‌ల్‌లోని తన రూమ్‌లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ లెటర్ రాసి హాస్టల్‌లో ప్రవళిక బలవన్మరణానికి ఒడిగట్టింది. ప్రవళిక మరణంతో నిరుద్యోగుల్లో అసంతృప్త కట్టలు తెంచ్చుకుంది. భారీగా బృందావన్ హాస్టల్ నిరుద్యోగులు చేరుకోగా.. పోలీసులు లాఠీ ఛార్జ్స చేసి వారి చెదర గొట్టారు.

కాగా టీఎస్పీఎస్సీని బోర్డును వెంటనే రద్దు చేసి కొత్త బోర్డు నిమియమించాలని ప్రతిపక్షాలు డిమాండా చేస్తున్నారు. ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ కూడా స్పందించారు. ప్రవళిక మరణంపై అధికారులను వివరణ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+