కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డే సీఎం.. తేల్చేశారుగా!!

తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ. ప్రస్తుతం వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన కొండ సురేఖ తెలంగాణ రాజకీయాలపై వన్ఇండియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారని, కెసిఆర్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న వేళ కొండా సురేఖ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఈ దఫా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్న కొండ సురేఖ ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ, వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ తాను ముఖ్యమంత్రి రేసులో లేనని పేర్కొన్న కొండ సురేఖ, ఆకాశానికి నిచ్చెన వెయ్యొద్దని పేర్కొని ఎవరం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలన్నారు.

 Revanth Reddy as CM if Congress party wins: Konda Surekha Sensation

మంత్రిగా తాను అర్హురాలినని, బీసీలో వేరే ఎవరూ మహిళలు లేరు కాబట్టి తనకు కచ్చితంగా మంత్రిగా అవకాశం వస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తామని, రేవంత్ రెడ్డినే సీఎంగా ఉంటారని కొండా సురేఖ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో రాజశేఖర్ రెడ్డికి ఎలా ప్రజాదరణ ఉందో రేవంత్ రెడ్డికి అలాగే ప్రజాదరణ ఉందన్నారు.

కచ్చితంగా రేవంత్ రెడ్డినే సీఎం అవుతారని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని అన్నారు. అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికే అవకాశం ఇస్తుందని, ఆయనే సీఎం కావాలని ఆశిస్తున్నామని కొండా సురేఖ తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్న కొండా సురేఖ రేవంత్ రెడ్డి తమ పార్టీ నుంచి సీఎం అవుతారని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి తన సంపూర్ణ మద్దతును కొండ సురేఖ ప్రకటించారు.

రానున్న రోజుల్లో కొండా కుటుంబానికి రాజకీయాలలో తగిన ప్రాధాన్యత ఉంటుందని, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని కొండా సురేఖ పేర్కొన్నారు. భవిష్యత్తులో కొండా మురళి కూడా ప్రత్యక్ష రాజకీయాలలో ఉంటారని కొండా సురేఖ వెల్లడించారు. ఇప్పటివరకు తాము పార్టీలు మారినంత మాత్రాన తమకు జరిగిన నష్టం ఏమీ లేదని పేర్కొన్న కొండా సురేఖ, ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైన పార్టీలను, నిరంకుశ పాలన సాగించే పార్టీలను తాము వదిలి వేశామని, వాటిని ప్రజలు పరిగణనలోకి తీసుకోరని పేర్కొన్నారు. .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+