జైల్లో రేవంత్, కల్సిన కేశవ్: మాట్లాడనన్న స్టీఫెన్ సన్

హైదరాబాద్: లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుండి చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏసీపీ (అవినీతి నిరోదక శాఖ) న్యాయస్థానం మంగళవారం అనుమతిని ఇచ్చింది.

దీంతో, రేవంత్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుండి చర్లపల్లి జైలుకు తరలించనున్నారు. రేవంత్‌ను చర్లపల్లి జైలుకు తరలించాలని జైలు అధికారులు ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, రేవంత్ రెడ్డి పెట్టుకున్ బెయిల్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా పడింది. కాగా, జైలులో రేవంత్ రెడ్డిని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కలిశారు. జైలులో ఎర్రబెల్లి దయాకర రావు, ఎల్ రమణలు కూడా కలిశారు.

Revanth Reddy bail petition adjourned

చట్టం తన పని తాను చేసుకుపోతుంది: స్టీఫెన్

రేవంత్ రెడ్డి వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్ సన్ అన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని, దానిపై తాను ఇప్పుడు మాట్లాడనని చెప్పారు.

కాగా, చంచల్ గూడ జైలులో రేవంత్ రెడ్డికి నెంబర్ 1779ను కేటాయించారు. తనకు ప్రాణభయం ఉందని రేవంత్ జడ్జికి విన్నవించారు. దీంతో హైసెక్యూరిటీ బ్యారక్‌లో అతనిని ఉంచారు. జైలు వద్ద పటిష్ట బంధోబస్తు ఏర్పాటు చేశారు.

రేవంత్ రెడ్డికి బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు అతనిని తమ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ వేశారు. మరోవైపు, తనకు జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని రేవంత్ మరో పిటిషన్ దాఖలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+