"నేనే రాజు-నేనే మంత్రి" అని ఎందుకన్నానంటే..? రేవంత్ క్లారిటీ..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తాజాగా తన పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మాట్లాడుతూ తెలంగాణకు నేనే రాజు -నేనే మంత్రి అని వ్యాఖ్యానించారు. దీనిపై సొంత పార్టీ కాంగ్రెస్ తో పాటు విపక్ష బీఆర్ఎస్ నేతలు, కవిత కూడా విమర్శలు గుప్పించారు. రేవంత్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నాని మండిపడ్డారు. దీంతో ఏమనుకున్నారో ఏమో కానీ రేవంత్ ఇవాళ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

'నేనే రాజు నేనే మంత్రి' అంటూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విపక్ష నాయకులు విమర్శలు గుప్పించడంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. గెలుపు, ఓటమి అన్నింటికీ తానే బాధ్యత తీసుకుంటాననే ఉద్దేశంలో తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. కానీ దానిని మరోలా అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు.

revanth reddy clarified to am the king am the minister comments says misunderstood

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ. తాను ఎప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదని, సేవకుడిగానే భావిస్తున్నానని వెల్లడించారు. ప్రజలు తమకు సేవ చేయడానికి ఓటు వేసి గెలిపించారని గుర్తుచేసుకున్నారు. అందుకే రాజకీయ నాయకులు పాలకులుగా భావించుకోవద్దని, సేవకులుగానే ఉండాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై విపక్షాలు ప్రజలను నిందిస్తున్నాయని రేవంత్ ఆక్షేపించారు. రాష్ట్రంలో అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలని ఆదేశాలు ఇస్తున్నామని, ప్రతి తండాలో పాఠశాల భవనాలు ఉండాలని తెలిపారు. అలాగే సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+