రేవంత్ రెడ్డి పోటీ అక్కడ నుండే ?ఈ సారైనా గట్టెక్కుతాడా ?

Recommended Video

    రేవంత్ రెడ్డి పోటీ అక్కడ నుండే ? ఈ సారైనా గట్టెక్కుతాడా ? | Oneindia Telugu

    సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలతో దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది.ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తెలంగాణలోనూ ఎన్నికల హోరు మొదలైపోయింది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ సీట్లుంటే... వాటిలో హైదరాబాద్ సీటును మజ్లిస్ కు వదిలేసి మిగిలిన 16 సీట్లను క్లీన్ స్వీప్ చేసే దిశగా అధికార టీఆర్ ఎస్ సాగుతోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ప్రచార హోరును కూడా ఓ రేంజిలో పెంచేసింది . అయితే గడచిన ఎన్నికల్లో బొక్కబోర్లా పడిన టీ కాంగ్రెస్ కనీసం లోక్ సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటుదామంటూ రంగంలోకి దిగిపోయింది. ఇందులో భాగంగా తొలి జాబితా కింద ఓ ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితాను విడుదల చేసిన టీ కాంగ్రెస్... మిగిలిన 9 స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది.

    రేవంత్ పోటీ చేసేది అక్కడ నుండే

    రేవంత్ పోటీ చేసేది అక్కడ నుండే

    ఈ జాబితాలో టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేరు ఉండటం, ఆయన మల్కాజ్ గిరి నుండి బరిలోకి దిగనుండటం తో ఇప్పుడు ఈ స్థానం హాట్ సీట్ గా మారిపోయింది. . ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి బరిలోకి దిగిన రేవంత్... టీఆర్ ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొత్త అభ్యర్థి నరేందర్ రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఓటమి తర్వాత నైరాశ్యంలో చాలా కాలం పాటు ఉన్న రేవంత్ తర్వాత కాస్త కోలుకుని అసెంబ్లీలో ఓడినా... లోక్ సభ బరిలో సత్తా చాటుతానంటూ మరో సంలచన ప్రకటన చేశారు రేవంత్... లోక్ సభ బరికి సంబంధించి గతంలో టీడీపీకి మంచి పట్టున్న మల్కాజిగిరి నుంచి బరిలోకి దిగుతున్న రేవంత్ పేరు ఫస్ట్ లిస్ట్ లోనే ఖరారు చేసిన టీ కాంగ్రెస్ పోటీకి సై అంది. రేవంత్ కూడా మల్కాజ్ గిరి లో ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని డిసైడ్ అయిపోయారు.

    మల్కాజ్ గిరి పై దృష్టి పెట్టిన కేసీఆర్ .. రేవంత్ మళ్ళీ టార్గెట్ అవుతారా

    మల్కాజ్ గిరి పై దృష్టి పెట్టిన కేసీఆర్ .. రేవంత్ మళ్ళీ టార్గెట్ అవుతారా

    గ్రేట‌ర్ హైదరాబాద్ ప‌రిధిలోని కీల‌క పార్లమెంట్ స్థానం మ‌ల్కాజ్‌గిరి. ఈ స్థానాన్ని గ‌తంలో తెలుగుదేశంపార్టీ కైవ‌సం చేసుకుంది. ప్రస్తుత మంత్రి మ‌ల్లారెడ్డి టీడీపీ పక్షాన గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజ్‌గిరి స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాల‌ని గులాబీపార్టీ ప‌క్కా వ్యూహంతో ఉంది. అంగ‌బ‌లం- ఆర్థిక‌బ‌లం మెండుగా ఉన్న నేత‌ను ఈ స్థానంలో నిల‌బెట్టాల‌ని కేసీఆర్‌ భావిస్తున్నారు. అయితే కేసీఆర్ నజర్ పెట్టిన ఈ స్థానం నుండి రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండటంతో కేసీఆర్ ఇక్కడ నుండ రేవంత్ ను ఎదుర్కొనే బలమైన అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం ఉంది. రాజకీయంగా శత్రువుగా భావించే రేవంత్ ను మరో మారు టార్గెట్ చెయ్యనున్నారు గులాబీ బాస్ .

    టీఆర్ఎస్ లో టికెట్ కోసం పోటీ ... రేవంత్ పై పోటీ విషయంలో వ్యూహాత్మక నిర్ణయం

    టీఆర్ఎస్ లో టికెట్ కోసం పోటీ ... రేవంత్ పై పోటీ విషయంలో వ్యూహాత్మక నిర్ణయం

    అయితే మంత్రి మ‌ల్లారెడ్డి అల్లుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి గ‌ట్టిగా ప్రయ‌త్నాలు చేస్తున్నారు. తాజాగా మ‌ల్కాజ్‌గిరి పార్లమెంటరీ నియోజ‌క‌వ‌ర్గ పార్టీ స‌న్నాహ‌క స‌మావేశంలోనూ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌డావిడి కనిపించింది. ఇక పార్టీలో మొద‌టినుంచి ఉన్న న‌వీన్‌రావు కూడా మల్కాజ్‌గిరి టిక్కెట్‌పై గంపెడాశ‌లు పెట్టుకున్నారు. పార్టీ అగ్రనేత‌ల అండ‌దండ‌లు ఉండ‌టంతో ఆయనా గ‌ట్టి ప్రయ‌త్నాలే చేస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ పార్లమెంట్ లో ముందు హిట్ లిస్టు లో ఉన్న మల్కాజ్ గిరి లో రాజకీయంగా బద్ధ శత్రువుగా భావించే రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతుండడంతో మల్కాజ్ గిరి నుండి కేసీఆర్ బరిలోకి దింపే అభ్యర్థి విషయంలో ఆచి తూచి వ్యవహరించనున్నారు . దీంతో మల్కాజ్ గిరి పోరు రసవత్తరంగా మారనుంది. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన రేవంత్ రెడ్డి ఈ సారి గులాబీ బాస్ టార్గెట్ చేసిన ఆ స్థానంలో గట్టెక్కుతాడా లేకా కేసీఆర్ రాజకీయ చాణిక్యం ముందు మరోమారు దెబ్బ తింటాడా ? అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+