రేవంత్ రెడ్డి ఒక రాజకీయ టెర్రరిస్ట్ .. బాల్క సుమన్ ఫైర్

ఇంటర్ ఫలితాల అవకతవకలపై విపక్షాలు పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆందోళనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్ళతో రాష్ట్రంలో రాజకీయం రసకందాయంలో పడింది. తాజాగా ఇంటర్ ఫలితాల అవకతవకలపై , అలాగే గ్లోబరీనా సంస్థకు టెండర్ ఇవ్వటంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని లేపాయి.ఇక రేవంత్ వ్యాఖ్యలపై బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు.

గ్లోబరీనా గురించి కేటీఆర్ కు తెలుసన్న రేవంత్ రెడ్డి

గ్లోబరీనా గురించి కేటీఆర్ కు తెలుసన్న రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గ్లోబరీనా గురించి తెలియదంటూ ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థను పక్కన పెట్టి మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్, గ్లోబరీనాలకు టెండర్లు కట్టబెట్టారన్నారు. ఇదంతా కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ కు అంతా తెలుసనీ చేసిన వ్యాఖ్యలపై బాల్క సుమన్ కౌంటర్ ఇచ్చారు.

 రేవంత్ ఒక రాజకీయ టెర్రరిస్ట్ అన్న బాల్క సుమన్

రేవంత్ ఒక రాజకీయ టెర్రరిస్ట్ అన్న బాల్క సుమన్

హైదరాబాద్ లోని టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడారు.సున్నితమైన, భావోద్వేగాలతో కూడిన ఇంటర్ ఫలితాల విషయంలో ప్రతిపక్షాలు సంయమనం లేకుండా వ్యవహరించాయని సుమన్ తెలిపారు.ఇక రేవంత్ రెడ్డి ఓ రాజకీయ టెర్రరిస్టు అని ఈ అంశంలో ఆయన కూడా మాట్లాడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు.

శంకరాచార్యులకు, పీర్ల పండుగకు ముడిపెడతాడని రేవంత్ పై బాల్క సుమన్ ఫైర్

శంకరాచార్యులకు, పీర్ల పండుగకు ముడిపెడతాడని రేవంత్ పై బాల్క సుమన్ ఫైర్

శంకరాచార్యులకు, పీర్ల పండుగకు ముడిపెడతాడని రేవంత్ పై విరుచుకుపడ్డారు.. మోకాలికి, బోడిగుండుకు ముడిపెడతాడని మండిపడ్డారు బాల్క సుమన్ . ఇంటర్ బోర్డు ఫలితాల నిర్వహణ, సాంకేతిక సేవల కోసం సెప్టెంబర్ 25, 2017న టెండర్ పిలిస్తే అందులో ఎల్1గా గ్లోబరీనా సంస్థ నిలిచిందని ఆయన చెప్పారు . ఈ కాంట్రాక్టు ఖరీదు కూ రూ.4,35,70,000. మూడేళ్లు సేవలు అందించిన అనంతరం ఈ సాఫ్ట్ వేర్ ను గ్లోబరీనా ఇంటర్ బోర్డుకు ఇవ్వాల్సి ఉంటుందని అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ ఒప్పందాన్ని ఓకే చేశారు అని పేర్కొన్నారు. కానీ రేవంత్ రెడ్డి సంబంధం లేకుండా ఎలా పడితే అలా ఆరోపణలు చెయ్యటం హాస్యాస్పదం అని బాల్క సుమన్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+