పక్కనే కూర్చున్నా చంద్రబాబుతో రేవంత్ మాటలేదు! నిఘా నేత్రం
హైదరాబాద్: రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి, అల్లుడు సత్యనారాయణ రెడ్డి నిశ్చితార్థాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భార్య భువనేశ్వరి దంపతులు దగ్గరుండి జరిపించారు. రేవంత్ కుమార్తె, అల్లుడికి చంద్రబాబు చేతుల మీదుగా నిశ్చితార్థ ఉంగరాలు ఇప్పించారు.
అనంతరం వారు ఉంగరాలు మార్చుకున్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి నిశ్చితార్థం సమయంలో పక్కపక్కనే కూర్చున్నారు. అయితే, వారి మధ్య ఎలాంటి మాటల్లేవ్! కోర్టు ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి రాజకీయ నాయకులతో మాట్లాడవద్దు.

రేవంత్ రెడ్డి కుమార్తెను, అల్లుడిని చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, లోకేష్, టీడీపీ సీనియర్ నేతలు తదితరులు ఆశీర్వదించారు. బీజేపీ నేతలు నాగం జనార్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు గుత్తా సుఖేందర్ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
నిశ్చితార్థం వేడుకలో రేవంత్ రెడ్డి చుట్టూ పోలీసులు నిఘా వేశారు. పోలీసు ఎస్కార్టు పర్యవేక్షణలో మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షఖన్ సెంటర్ హాలులో నిశ్చితార్థం జరిగింది. చుట్టూ పోలీసులు మోహరించారు. ఈ నిశ్చితార్థానికి పెద్ద ఎత్తున రేవంత్ అభిమానులు, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, నేతలు తరలి వచ్చారు.












Click it and Unblock the Notifications