'వైర్ లెస్' సిటీగా హైదరాబాద్.. అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ వేగవంతం

విద్యుత్ శాఖ పై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో SPDCL, NPDCL తో పాటు మరో కొత్త డిస్కం ఏర్పాటు చేయాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించగా.. దీనికి సంబంధించి ప్రాథమిక ప్రణాళికను అధికారులు వివరించారు.

వ్యవసాయం, మేజర్, మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా , జీహెచ్ఎంసీ పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదన పై చర్చించారు. డిస్కంల పునర్విభజన తర్వాత PPA అలొకేషన్, సిబ్బంది, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కేబినెట్ ఆమోదం అనంతరం కొత్త డిస్కం ఏర్పాటుపై ముందుకెళ్లాలని ఆదేశించారు.

గ్రేటర్ హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ విధానంపై పలు ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు. డిసెంబరులోగా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించి, వచ్చే రెండున్నరేళ్లలో కోర్ అర్బన్ రీజియన్ లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Revanth Reddy Powers Up Hyderabad Orders Underground Cabling Plans by December 2025

ఓవర్ లోడ్ సమస్యలు తలెత్తకుండా కోర్ అర్బన్ రీజియన్ లో విద్యుత్ సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని సూచించారు. కోర్ అర్బన్ రీజియన్ లో ఎక్కడెక్కడ కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల అవసరం ఉందో గుర్తించి, ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

మరోవైపు విశ్వనగరంగా హైదరాబాద్‌ ‌‌‌ను తీర్చిదిద్దేందుకు వీధుల్లో వేలాడుతున్న ఓవర్‌ ‌‌‌హెడ్ విద్యుత్ లైన్లను తొలగించి, భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరుగుతోంది. ఓవర్ హెడ్ కేబుల్స్ లేకుండా చేసేందుకు గ్రేటర్ పరిధిలో ఒక్కో సెక్షన్‌‌‌‌కు రూ.100 కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+