ఇప్పుడేమంటారు? తలసానిపై చర్య లేకుంటే గవర్నర్ పాత్రపై డౌట్: రేవంత్

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన రాజీనామా పైన తప్పుదారి పట్టించారని, గవర్నర్ నరసింహన్ ఇప్పుడేమంటారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆదివారం ప్రశ్నించారు. ఆయనను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలన్నారు.

తలసానిపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఈ రాజీనామా ఉదంతంలో గవర్నర్‌కు కూడా పాత్ర ఉందని అనుమానించవలసి వస్తుందన్నారు. గవర్నర్ తీసుకునే చర్యను బట్టి ఆయన సచ్ఛీలత ఏంటో తెలుస్తుందన్నారు.

Revanth Reddy questions about Talasani resignation

తలసానిని రాజకీయాల నుంచే బర్తరఫ్ చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రాజీనామా వ్యవహారంలో తప్పంతా సభాపతిదేనని చెప్పారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ టీఆర్ఎస్ నేతగా మారారని దుయ్యబట్టారు.

పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశిస్తే సభాపతి ఆసుపత్రిలో చేరారన్నారు. తలసాని రాజీనామా చేయక పోవడం పైన తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరామ్, అల్లం నారాయణ స్పందించాలన్నారు. తెలంగాణ ప్రజల ముందు టిఆర్ఎస్ నేతలు దోషులుగా నిలబడ్డారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+