కూతురు ఎంగేజ్‌మెంట్: బెయిల్‌పై రేవంత్ రెడ్డి ఆరా

హైదరాబాద్: ఈ నెల 11న తన కుమార్తె నిశ్చితార్థం ఉందని, ఆ రోజుకల్లా తనకు బెయిల్ వస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి అన్నట్లుగా తెలుస్తోంది. జైలులో ఉన్న ఆయనను పలువురు నేతలు కలుస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన బెయిల్ పైన ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.

తనవల్ల టీడీపీ ప్రతిష్టకు ఇబ్బంది ఏమైనా ఏర్పడిందా అని అడిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుట్ర పన్ని తనను ఇరికించారని, అయినాసరే టీడీపీ తరఫున ప్రజల సమస్యల పైన పోరాడాల్సిందేనని రేవంత్ వారితో చెప్పారని తెలుస్తోంది.

Revanth Reddy says he will clean

ఏసీబీ కేసులో పస లేదని, నిబంధనల ప్రకారం అది కోర్టులో చెల్లదని చెప్పారని సమాచారం. తాను నిర్దోషిగా బయటకు వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఎమ్మెల్యేలు కలిశారా లేదా?

కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, రేవంత్ న్యాయవాదులు జైలులో రేవంత్ రెడ్డిని కలిశారు. సహచరులను, న్యాయవాదులను కలిసిన రేవంత్ ఎమ్మెల్యేలతో ములాఖత్‌కు ఆసక్తి చూపలేదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, ప్రకాశ్ గౌడ్‌లు చర్లపల్లి జైలుకు వచ్చారు. రేవంత్ వారిని కలిసేందుకు ఆసక్తి చూపించక పోవడంతో వారు. సెబాస్టియన్‌ను మాత్రమే కలిసి వచ్చినట్లుగా తెలుస్తోంది. రేవంత్‌ను కలిశారని కొందరు అంటున్నారు. కొడంగల్ నుండి వచ్చిన కొందర్ని పోలీసులు ములాఖత్‌కు అనుమతించలేదు. జైలులో రేవంత్ ముభావంగానే కనిపించారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+