కెసిఆర్‌కు వాస్తు పిచ్చి పట్టుకుంది: దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు వాస్తు పిచ్చి పట్టుకుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సరైన ప్రతిపాదనలు పంపకపోవడంతో కేంద్రం నుంచి నిధులు కూడా రావడం లేదని చెప్పారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేడిపండులా ఉందని ఆయన విమర్శించారు. వాస్తవ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీతాలు, పెన్షన్లు ఇవ్వాలన్నా తాగుబోతుల మీద ఆధారపడాల్సి వస్తోందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు

Revanth Reddy says KCR is in vasthu madness

రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదని కాంగ్రెస్ నేత మల్లు రవి మండిపడ్డారు. మిగులు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని వ్యాఖ్యానించారు. అప్పులతోనే ప్రభుత్వ పథకాలు కొనసాగే పరిస్థితి ఏర్పడిందన్నారు.

ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. భూముల అమ్మకంపై పునరాలోచన చేయాలన్న మల్లు రవి ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party (TDP) Telangana working president Revanth Reddy said that CM K Chandrasekhar Rao is in Vasthu madness

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి