రేవంత్ రెడ్డి సంచలనం: కళ్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలు, తులం బంగారం!!

తెలంగాణలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు ప్రజా క్షేత్రంలో ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. భారీ బహిరంగ సభలతో హడావిడి చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులను రంగంలోకి దింపింది. ఈ రోజు ములుగు వేదికగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు.

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ములుగు జిల్లా రామాంజిపురంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన కెసిఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తొమ్మిదేళ్ల తెలంగాణలో అత్యాచారాలు, అరాచకాలు, ఆత్మహత్యలు, ఆధిపత్యమే కనిపిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Revanth Reddy sensation on kalyana lakshmi scheme!!

రాష్ట్రాన్ని రక్షించేందుకు సోనియా గాంధీ కుటుంబం మన ముందుకు వచ్చిందన్న రేవంత్ రెడ్డి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది... కానీ ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం సోనియాగాంధీ ఆరు గ్యారంటీలు ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కారు చేసిందేమీ లేదని, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను కూడా కేసీఆర్ నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి తెలిపారు.

అమరులు, నిరుద్యోగుల ఆశలను కేసీఆర్ అడియాసలు చేశారని రేవంత్ రెడ్డి గులాబీ బాస్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా, అవినీతి అరాచకం రాజ్యమేలుతుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని సోనియాగాంధీ కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, అటువంటి మాటకు కట్టుబడి ఉండే పార్టీని ఆదరించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

ములుగులో సీతక్క ను, భూపాలపల్లి లో గంటల సత్యనారాయణను గెలిపించాలని రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, రైతులకు ఏటా 15 వేల రూపాయలు, కళ్యాణ లక్ష్మి క్రింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+