వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరీశ్‌ రావుకు రేవంత్ ఫోన్: సానుకూలంగా స్పందించిన మంత్రి

తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుకు ఫోన్ చేశారు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రైతు సమస్యలను మంత్రి హరీశ్‌రావ్‌ దృష్టికి తీసుకెళ్లారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/వరంగల్‌: తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుకు ఫోన్ చేశారు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా
రైతు సమస్యలను మంత్రి హరీశ్‌రావ్‌ దృష్టికి తీసుకెళ్లారు.

వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఆందోళనలో పాల్గొన్న రేవంత్‌ రైతు సమస్యలను ఫోన్‌లో హరీశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. మిర్చి, కంది పంటలకు ధరకల్పించాలని ఆయన మంత్రిని కోరారు.

Revanth Reddy talks with Harish Rao

దీనికి సానుకూలంగా స్పందించిన హరీశ్‌రావు.. ప్రభుత్వం తరపున కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ఆధ్వర్యంలో ఎనుమాముల నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రేవత్‌రెడ్డితోపాటు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్క, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో గురువారం కలుసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వారు ఆయనకు నివేదికను సమర్పించారు. పలు ప్రజా సమస్యలను వారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గవర్నర్‌ను కలిసిన నేతల్లో టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, నేతలు రావుల చంద్రశేఖర్, మోత్కుపల్లి నర్సింహులు, శోభరాణి తదితరలు ఉన్నారు. తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని ఎల్ రమణ ఆరోపించారు.

English summary
Telangana TDP leader and MLA Revanth Reddy on Thursday talked with Harish Rao through phone to discuss farmer issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X