రేవంత్ బెదిరించారు- చెంచా గాళ్లతో కోటరీ : చాలా మంది పార్టీ వీడుతారు: శశిధర్ రెడ్డి సంచలనం..!!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ పైన మండిపడ్డారు. తాను తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ వీడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశమైన మర్రి శశిధర్ రెడ్డి నాలుగైదు రోజుల్లోనే బీజేపీలో చేరనున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్ లో లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందంటూ మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అది నయం చేయలేని స్థితికి చేరుకుందని చెప్పారు.

శశిధర్ టార్గెట్ రేవంత్
ఒక హోంగార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి పోతే పోయేదేమీ లేదని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగ్గా లేదని వ్యాఖ్యానించిన శశిధర్ రెడ్డి..మునుగోడు ఉప ఎన్నికల్లో తాను 10 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని వెల్లడించారు. ఇంఛార్జ్ లతో డబ్బు ఖర్చు చేయించి వారికి నష్టం చేసారని వివరించారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టకపోతే టికెట్లు, పదవులు ఇవ్వనని వారిని రేవంత్ బెదిరంచారని శశిధర్ రెడ్డి చెప్పుకొచ్చారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అందుబాటులో ఉండరని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. చెంచా గాళ్లను పెట్టి పార్టీని నడిపిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తాను మాత్రమే కాదని, తన లాగే అనేక మంది పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నారని శశిధర్ రెడ్డి వెల్లడించారు.

రేవంత్ సొంత దుకాణం కోసమే
మూడు వేల నుంచి 20వేల కు ఓట్లు పెరిగాయని సంబరపడడం అవివేకమని మునుగోడు ఉప ఎన్నిక ఫలితాన్ని శశిధర్ రెడ్డి విశ్లేషించారు. వచ్చే ఎన్నికల్లో పదిహేను మందిని గెలిపించుకొని తన సొంత దుకాణం చూసుకోవాలని రేవంత్ భావిస్తున్నారంటూ శశిధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. తాను కూడా అప్పట్లోనే పీసీసీ రేవంత్ కు ఇవ్వద్దని వారించానని వెల్లడించారు. తెలంగాణ పార్టీ పరిస్థితులపై మూణ్ణెళ్ల క్రితమే అధిష్టానానికి వివరించానన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి మారుతానని అనుకోలేదని, ఎప్పటికీ తాను కాంగ్రెస్ మ్యాన్ గానే ఉంటానని భావించానని చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో పార్టీ మారుతున్నానని వివరించారు.

మరి కొంత మంది పార్టీ వీడుతారు
తాను రాజీకయ నాయకుడినేనని..ఇంకా రాజకీయాల నుంచి రిటైర్ కాలేదన్నారు. మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ తరువాత తన అనుచరులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ కు వచ్చి తన మద్దతు దారులతో చర్చించిన తరువాత అధికారికంగా బీజేపీలో చేరాలని శశిధర్ రెడ్డి నిర్ణయించారు. అటు కాంగ్రెస్ లో శశిధర్ రెడ్డి పార్టీ వీడటం పైన ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఇందుకు పీసీసీ చీఫ్ రేవంత్..సీఎల్పీ లీడర్ భట్టి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. శశిధర్ రెడ్డి పార్టీ వీడటం కాంగ్రెస్ కు నష్టమేనన్నారు. ఇక, ఇప్పుడు రేవంత్ లక్ష్యంగా శశిధర్ రెడ్డి విమర్శలు చేయటంతో, రేవంత్ వర్గం ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565











Click it and Unblock the Notifications