లోయర్ మానేరు డ్యామ్ కు పెరుగుతున్న వరద; 16గేట్లను ఎత్తిన మంత్రి గంగుల!!

భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో ఎటువంటి ఆస్థి, ప్రాణ నష్టం వాటిల్లకుండా పటిష్టచర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.కరీంనగర్ జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ ఈఎన్సి, సిపి లతో కలసి కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం 16 గేట్లను రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెరిచారు.

మిడ్ మానేరు, ఎస్సారెస్పి తూములు ఉన్నప్పటికి మోయతుమ్మెద వాగుల నుండి నియంత్రించలేని విధంగా నీరు వస్తుండటంతో లోయర్ మానేరు డ్యాం గేట్లను తెరిచారు. ఎల్.ఎం.డిలో 20 నుండి 24 టియంసీ సామర్థ్యం గల నీటిని మాత్రమే నిలువ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎగువ నుండి ఎల్ఎండి కి 17 టియంసీల నీరు వచ్చిచేరింది.

Rising flood to Lower Manair Dam; Minister Gangula kamalakar lifted 16 gates of dam!!

మొయతుమ్మెద వాగు ప్రస్తుతం 50వేల క్యూసెక్ నీటితో ప్రవహిస్తుంది. మిడ్ మానేరు నుండి 1లక్ష 5వేల క్యూసెక్ లతో కలిపి మొత్తం ఎల్ఎండిలో లక్షా యాబై ఐదు వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నీరు వచ్చి చేరుతోంది. దీనితో 20వేల క్యూసెక్ ల నీటిని గోదావరిలోకి విడుదల చేయడం కోసం ఎల్ఎండి గేట్లను తెరిచారు మంత్రి గంగుల కమలాకర్.

Rising flood to Lower Manair Dam; Minister Gangula kamalakar lifted 16 gates of dam!!

ఎల్ ఎం డి కి ఎగువ నుండి వచ్చే నీటి ఆధారంగా ఔట్ ఫ్లో పెంచడం, తగ్గించడం జరుగుతుందన్నారు. దిగువకు నీటీని విడుదల చేయడం ద్వారా ఎక్కడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడడం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులు, గొర్రెలు వెళ్ళకుండా చూడాలని హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు ఎవరూ అటు వెళ్లొద్దు అన్నారు.

Rising flood to Lower Manair Dam; Minister Gangula kamalakar lifted 16 gates of dam!!

కాగా కరీంనగర్ లో భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో ఎక్కడా ఎటువంటి ఆస్థినష్టం గాని ప్రాణ నష్టం గాని వాటిల్లకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కెనాల్ ల ఓవర్ ఫ్లో కారణంగా రోడ్లపై నుండి వరద ప్రవహించడంతో అక్కడక్కడ కొంతమేర రోడ్లు డ్యామేజ్ అయ్యాయని, భారీ వర్షాలతో జిల్లా కేంద్రంలో ఎక్కడ నీరు నిలిచినా అరగంటలోనే క్లియర్ చేస్తున్నామని తెలిపారు.
Rising flood to Lower Manair Dam; Minister Gangula kamalakar lifted 16 gates of dam!!

జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన వెనువెంటనే చర్యలు తీసుకోవడానికి అధికార యంత్రంగం సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి చిన్న సంఘటన కూడ సంభవించలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నందున అత్యవసర పనులుంటే తప్ప బయటకు రాకూడదని సూచించారు.వర్షాల కారణంగా ఎక్కడా అంటు వ్యాధులు సంభవించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+