ఘోర రోడ్డు ప్రమాదం: కారు-బైక్ ఢీకొనడంతో రెండు కుటుంబాల్లో ఐదుగురు మృతి
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతపల్లిమండలం నర్సర్లపల్లి వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొని కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురు మృతి చెందగా, కారులోని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ నుంచిఅక్కంపల్లి వస్తున్న బైక్‌ను కారు బలంగా ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే మద్దిమడుగు ప్రసాద్(38), అవినాశ్(12) మృతి చెందారు.బైక్‌పై ఉన్న మహిళ, కారులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పట్నపు మణిపాల్(18) మృతి చెందాడు.

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా..మార్గమధ్యలోనే వనం మల్లిఖార్జున్(12), మద్దిమడుగు రమణమ్మ(35) మృతి చెందారు. బైక్‌పై వస్తూ ప్రమదానికి గురైనవారు పెద్దఅడిసర్లపల్లి మండలం అక్కంపల్లి గ్రామానికి చెందినవారీగా గుర్తించారు. కారులో ఉన్న వారు చింతపల్లి మండలం గుర్రంపల్లికి చెందినవారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఆర్టీసీ బస్సు బోల్తాపడి ఇద్దరు మృతి
యాదాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తొర్రూరు నుంచి హైదరాబాద్‌కి ఉదయం 10 గంటలకు బయలుదేరింది. అడ్డగుడూర్ మండలం బొడ్డుగూడెం వద్దకు రాగానే అతి వేగంగా వచ్చిన బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి బోల్తా కొట్టింది.
దీంతో ఘటనా స్థలంలోనే అడ్డ గూడూరు మండలం చిన్న పడిశాలకు చెందిన చుక్క యాకమ్మ అనే మహిళ, బీబీనగర్‌కు చెందిన కొండా రాములు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కొండా రాములు అడ్డగుడూర్ మండలం కోటమర్తి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. గాయపడ్డ వాళ్లను సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications