రోడ్డు ప్రమాదం: హెల్మెట్ కాపాడలేదు.. టెక్కీ మృతి

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం ఢీకొని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హెల్మెట్ ధరించినా లారీ వేగానికి అది పగిలిపోవడంతో అతడు మరణించాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీకేగూడ నెహ్రూనగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి విష్ణుకుమార్‌ కుమారుడు కె సుమంత్‌(23) హైటెక్‌ సిటీలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

Road accident: A techie killed in Borabanda

బుధవారం ఉదయం 10 గంటలకు తన బైక్‌పై బయలుదేరాడు. బోరబండ సమీపంలోని విజేత థియేటర్‌ వద్ద వెనుక నుంచి దూసుకొచ్చిన డీసీఎం అతడ్ని ఢీకొట్టింది. ఆ తర్వాత కిందపడిన సుమంత్‌ పైనుంచి డీసీఎం దూసుకుపోవడంతో అతడు పెట్టుకున్న హెల్మెట్ కూడా పగిలిపోయింది.

దీంతో తలకు తీవ్ర గాయాలై సుమంత్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈమేరకు ఎస్సార్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న డీసీఎం డ్రైవర్ కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. చేతికందొచ్చిన కొడుకు ఇలా మృత్యువాత పడటంతో సుమంత్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A techie killed in a road accident, occurred in Borabanda in Hyderabad on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి