రైల్లో దోపిడీ, నాంపల్లి దాకా మత్తులో కుటుంబం: పిల్లలకి విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

హైదరాబాద్: విశాఖ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ కుటుంబానికి మత్తుమందు ఇచ్చి దోపిడీ చేసిన సంఘటన చోటు చేసుకుంది. దుండగులు వారు తాగిన బాదాం పాలల్లో మత్తు మందు కలిపారు. రైలు నాంపల్లి స్టేషన్ వచ్చే వరకు కూడా ఆ కుటుంబం మత్తులోనే ఉంది.

దీనిని గుర్తించిన రైల్వే పోలీసులు వారిని ఆసుపత్రిలో చేర్పించారు. వారి నుంచి బంగారు నగలు, కొంత మొత్తం దుండగులు దోచుకున్నట్లుగా తెలుస్తోంది.

 Robbers loot train passengers

పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

హైదరాబాదులోని సూరారం కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు విషం ఇచ్చి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి స్వర్ణకారుడు. అతని పేరు బ్రహ్మచారి. కూతుళ్లు అపర్ణ, జయశ్రీ.

నలుగురు చైన్ స్నాచర్ల అరెస్ట్

హైదరాబాద్ పోలీసులు నలుగురు చైన్ స్నాచర్లను గురువారం నాడు అరెస్టు చేశారు. వారి పైన 46 స్నాచింగ్ కేసులు ఉన్నాయి. అరెస్టైన వారిలో ఫరూక్ గ్యాంగ్, ఇరానీ గ్యాంగుకు చెందిన వారిగా గుర్తించారు.

మల్కాజిగిరి, కూకట్ పల్లి ప్రాంతంలో ఈ రెండు గ్యాంగులు చైన్ స్నాచింగ్‌‍కు పాల్పడుతున్నాయి. వారి నుంచి కిలో వరకు బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు కొంతకాలంగా నగర పోలీసులసు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+