రౌడీ షీటర్ హత్య కేసులో అరెస్ట్: దృష్టి మళ్లించి..

Rowdy sheet murder case busted in Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్‌ బోలానగర్‌లో రౌడీషీటర్‌ నయీంఖాన్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నయీం హత్య కేసు నిందితులు రబ్బానీ, షరీఫ్‌, అజహర్‌లను అరెస్ట్‌ చేశారు. బోలానగర్‌లోని 600 గజాల స్థలం విషయంలో వచ్చిన వివాదమే హత్యకు కారణంగా తెలుస్తోంది. గతరాత్రి మందుల కోసం బయటకు వచ్చిన నయీంపై ప్రత్యర్థులు తల్వార్లతో దాడి చేశారు. ఆస్పత్రికి తరలించేలోపే నయీం మృతి చెందాడు.

దృష్టి మళ్లించి దోపిడీ

హైదరాబాద్ నగరంలోని చైతన్యపురిలో వ్యక్తి దృష్టి మళ్లించి దోపిడీకి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని వస్తున్న బాలరాజు అనే వ్యక్తి దృష్టి మళ్లించి దొంగలు 7.78 లక్షల రూపాయలు అపహరించికుపోయినట్లు తెలుస్తోంది.

సింగరేణి కాలనీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్‌ లీకై అగ్నిప్రమాదం సంభవించింది. ఇళ్లు పూర్తిగా దగ్దమైంది. ఇంట్లో ఉన్న సామాగ్రితో పాటు నగలు, నగదు అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేయడంతో ప్రాణనష్టం తప్పింది. రూ.లక్ష వరకు కాలిబూడిదైపోయిందని ఇంటి యజమాని జహంగీర్‌ వాపోతున్నారు.

రైతు ఆత్మహత్య

మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం బూర్గుపల్లిలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల భారంతో మల్లయ్య అనే రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+