నడీరోడ్డుపై రౌడీ షీటర్‌ను ఇనుప రాడ్లతో కొట్టిచంపారు(పిక్చర్స్)
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్‌పల్లి గేటువద్ద సోమవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఓ రౌడీషీటర్‌ను ప్రత్యర్థులు నడిరోడ్డుపై దారుణంగా హతమార్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నడిరోడ్డుపైనే..
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పాతబస్తీలోని బార్కస్‌లో ఉండే అమర్ అంషాన్ (42) స్థిరాస్తి వ్యాపారం చేస్తుంటారు. భూ వివాదాలకు సంబంధించి గతంలో అమర్‌పై పహాడీషరీఫ్, చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్‌గా నమోదై ఉన్నాడు.

దారుణ హత్యకు గురైన అమర్ అంషాన్
కాగా, అమర్ సోదరుడు అలీ అంషాన్ బాలాపూర్ పరిధిలో ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. జల్‌పల్లి చౌరాస్తా సమీపంలోని భూములకు సంబంధించి చాంద్రాయణగుట్టకు చెందిన కొంతమంది రౌడీషీటర్లు, స్థిరాస్తి వ్యాపారులతో అమర్ అంషాన్‌కు వివాదాలున్నాయి.

ఘటనా స్థలం
ఈ క్రమంలో అమర్, సోదరుడు అలీ అంషాన్‌పై గతంలో మూడుసార్లు హత్యాయత్నం జరిగింది. కాగా, బార్కస్‌లోని తన నివాసం నుంచి భూవిక్రయాలకు సంబంధించి పలువురు వ్యక్తులతో చర్చించడానికి సోమవారం సాయంత్రం అమర్ అంశాన్ జల్‌పల్లి పురపాలక సంఘం పరిధిలోని షాహిన్‌నగర్‌కు వచ్చారు.

అమర్ అంషాన్(ఫైల్ ఫొటో)
అక్కడ పలువురితో చర్చించిన అనంతరం సాయంకాలం 4.45 గంటల సమయంలో జల్‌పల్లి చౌరాస్తా సమీపంలోని న్యూబాబానగర్‌కు వెళ్లే హెచ్‌పీ పెట్రోల్ బంకు పక్క నుంచి తన హోండా ఆక్టీవా వాహనంపై వెళుతున్నారు. అక్కడ మాటువేసిన ప్రత్యర్థి ఇనుపరాడ్‌తో అమర్ అంశాన్ తలపై గట్టిగా కొట్టాడు. దీంతో అమర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.












Click it and Unblock the Notifications