వారి ఖాతాలలో రూ.1,03,000.. దీపావళి బోనస్ తో వాళ్లకు పండుగే!
దీపావళి పండుగ సమీపిస్తోంది. ఈ దీపావళి పండుగకు తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు ప్రకటించిన బోనస్ వారి ఖాతాలలో జమ కానుంది. సింగరేణి కార్మికులకు దసరా పండుగకు బోనస్ ప్రకటించింది. ఇక దీపావళికి బోనస్ కూడా రావడంతో సింగరేణి కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన పర్ఫామెన్స్ లింకు అవార్డు కింద సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి 1,03,000 రూపాయలు చొప్పున బోనస్ లభిస్తుంది.
సింగరేణి కార్మికులకు సంతోషం కలిగించే వార్త
పండుగ బోనస్ లభిస్తున్న క్రమంలో సింగరేణి కార్మికులు దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోనున్నారు. నల్లబంగారాన్ని వెలికి తీసి దేశానికి అందిస్తున్న సింగరేణి కార్మికులు అహర్నిశలు ప్రాణాలకు తెగించి బొగ్గు గనుల్లో పని చేస్తూ ఉంటారు. అటువంటి కార్మికుల కృషిని గుర్తించి సంస్థ లాభాలలో వాటా ఇస్తుంది సింగరేణి. దీని ఫలితంగా కార్మికులు తమ కష్టానికి తగిన గుర్తింపుని ఇస్తున్నందుకు సంతోషంగా సంస్థను లాభాలబాట పట్టించడానికి పనిచేస్తారు.

లక్ష రూపాయలకు పైగా దీపావళి బోగస్
కేంద్ర ప్రభుత్వ అధీనంలోని కోల్ ఇండియా ప్రతి సంవత్సరం సింగరేణిలో పనిచేసే ఉద్యోగులకు పిఎన్ఆర్ బోనస్ ను ప్రకటిస్తుంది. అయితే ఈ బోనస్ ఎంత ఇవ్వాలి అనేది మాత్రం సంస్థ లాభాలను బట్టి నిర్ణయిస్తారు. గత సంవత్సరం సింగరేణి కార్మికులకు 93,750 రూపాయల బోనస్ అందించిన కోల్ ఇండియా ఈసారి ఆ మొత్తాన్ని 1,3 వేల రూపాయలకు పెంచింది. గతం కంటే 9250 రూపాయల బోనస్ పెరిగింది.
సింగరేణి కార్మికుల ఖాతాలలో నగదు జమ
కోల్ ఇండియా చరిత్రలో కార్మికులకు ఇంత పెద్ద మొత్తంలో బోనస్ లభించడం ఇదే మొదటిసారి. 2010- 2011 ఆర్థిక సంవత్సరంలో 21 వేలుగా ఉన్నటువంటి బోనస్ క్రమంగా పెరుగుతూ ఈసారి లక్ష రూపాయల మార్కును దాటింది. ఇది సింగరేణి కార్మికుల కుటుంబాలలో సంతోషాన్ని నింపుతుంది. ఇండియాలో పని చేస్తున్న ఇతర కార్మికులకు ఈ పి ఎల్ ఆర్ బోనస్ సెప్టెంబర్ లోనే అందగా సింగరేణిలో పనిచేసే కార్మికులకు మాత్రం ఇప్పుడు అందుతుంది.
దసరా బోనస్ ప్రకటించిన తెలంగాణా ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ దసరా సందర్భంగా కార్మికులకు బోనస్ ప్రకటించింది, ఇప్పుడు సంస్థ లాభాలలో 34 శాతం వాటాను కార్మికులకు పంచాలని నిర్ణయం తీసుకుంది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపిన వివరాల ప్రకారం దీని ద్వారా ఒక్కో కార్మికుడికి 1,95,610రూపాయలు బోనస్ లభిస్తుంది.
దేశంలో తొలిసారి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్
దేశ చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ చెల్లిస్తున్నట్టు వారు ప్రకటించారు. మొత్తం సింగరేణి సంస్థలో పని చేసే 41,000మంది శాశ్వత ఉద్యోగులకు మొత్తం 819కోట్ల రూపాయల దసరా బోనస్ పంపిణీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. 30వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 5,500 చొప్పున అందిస్తామని కూడా రేవంత్ తెలిపారు. ఇక కోల్ ఇండియా ప్రకటించిన దీపావళి బోనస్ ఖాతాలలో జమ చేస్తున్న క్రమంలో కార్మికులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications