Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రతి మహిళకు ఏడాదికి రూ. లక్ష: లెక్క తేలాలంటూ రాహుల్ గాంధీ

మెదక్: రాజ్యాంగంతోనే దేశంలో పేదలకు బలమైన శక్తి వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం అనే పుస్తకం మాములు పుస్తకం కాదని, మహా మహా మేధావులు ఏళ్ల తరబడి కృషి చేసి దేశానికి రాజ్యాంగం అందించారన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన జనజాతర సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీపై విమర్శల దాడికి దిగారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆర్‌ఎస్సెఎస్‌ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
విద్య, ఉద్యోగాలు, ఓటుహక్కు అన్నీ మనకు రాజ్యాంగం ద్వారానే వచ్చాయని రాహుల్‌ గాంధీ చెప్పుకొచ్చారు.

Rs 1 lakh for every woman Rahul gandhi slams bjp in telangana election campaign

రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని రాహుల్ ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించి అన్నీ ప్రైవేటుపరం చేస్తున్నారని, క్రమంగా ప్రైవేటీకరణ పెంచి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ ఆలోచన అని రాహుల్ ఆరోపించారు.

దేశంలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం దక్కటం లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వెనుకబడిన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో ముందు లెక్కలు తేలాలన్నారు. ఒకసారి జనగణన చేస్తేనే.. ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలుస్తుందని రాహుల్ స్పష్టం చేశారు. మోడీ గత పదేళ్లలో విమానాశ్రయాలు, పోర్టులు, భారీ పరిశ్రమలను విక్రయించారని రాహుల్ ఆరోపించారు.

కేవలం 2 శాతం ఉన్న బిలియనీర్ల చేతిలోకి దేశ సంపద అంతా వెళ్తోందని, ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతగా ప్రైవేటును ప్రోత్సహించలేదన్నారు రాహుల్. పెట్టుబడిదారులకు బీజేపీ కొమ్ముకాస్తోందని ఆరోపించారు. దేశంలోని నిరుపేదలందరితో ఒక జాబితా రూపొందిస్తామని, రైతులు దళితులు ఆదివాసీలు, మైనార్టీలతో ఒక జాబితా రూపొందిస్తామన్నారు.

ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మహిళను ఎంపిక చేసి రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ ఖర్చుల కోసం ప్రతి పేద మహిళ బ్యాంకు ఖాతాలో నెలకు రూ. 8500 చొప్పున.. ఏడాదికి రూ.లక్ష డిపాజిట్‌ చేస్తామన్నారు రాహుల్. బ్యాంకు ఖాతాల్లో వేసిన డబ్బులతో మహిళలు ఎన్నో వస్తువులు కొనుగోలు చేస్తారని, మహిళల కొనుగోలు శక్తి పెరగటంతో పరిశ్రమల్లో వస్తు ఉత్పత్తి పెరుగుతుందన్నారు. ఉద్యోగా కల్పనకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రాహుల్ ప్రజలను కోరారు. నర్సాపూర్ తోపాటు హైదరాబాద్ సరూర్‌గర్ సభలోనూ పాల్గొని ప్రసంగించారు రాహుల్ గాంధీ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+