Rythu Bandhu: 50,43 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3246 కోట్లు జమ..
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం కింద రైతులకు ఎకరానికి రూ.10 వేలు అందిస్తోంది. ఒక సంవత్సరంలో రెండు దఫాలుగా అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. వర్షకాలం రూ.5 వేలు, యాసంగికి రూ.5 వేలు పంపిణీ చేస్తోంది. వర్షకాలానికి సంబంధించి జూన్ 26 నుంచి రైతుల ఖాతాల్లో పైసలు జమ చేస్తోన్నారు. మొదటగా ఎకరం లోపు ఉన్నవారికి డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఆ తర్వాత రెండు, మూడు ఇలా విస్తిర్ణాన్ని బట్టి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు వేయనున్నారు.
జూన్ 26 రైతుల ఖాతాల్లో 642 కోట్లు జమ చేసిన ప్రభుత్వం.. మూడో రోజు రూ. 1325 కోట్లను అన్నదాతలకు పంపిణీ చేసింది. ఇప్పటివరకు 50,43 లక్షల మంది రైతుల ఖాతాల్లో పైసలు జమ చేశారు. ఈ మూడు రోజుల్లో మొత్తం రూ.3246 కోట్లు అన్నదాతల బ్యాంకు అకౌంట్లో వేశారు. ఈ రైతు బంధ పథకం 2018 మే 10 సీఎం కేసీఆర్ హుజూరాబాదా నియోజకవర్గంలోని శాలపల్లిలో ప్రారంభించారు.

ఇప్పటికే ఇప్పటికే 10 ధఫాలుగా ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో వేశారు. ప్రస్తుతం ఆరో దఫా పంపిణీ జరుగుతోంది. అయితే రైతు బంధు కు లిమిట్ లేకపోడంతో వంద ఎకరాలు ఉన్నవారికి కూడా డబ్బులు వస్తున్నాయి. సినిమా హీరోలకు, పారిశ్రామికవేత్తలు, పన్ను కట్టేవారికి కూడా రైతు బంధు వస్తోంది. దీని వల్ల పథకం ఉద్దేశం నీరుగారిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
అంతకాకుండా కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రైతు బంధుకు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చిన వ్యవసాయ శాఖ ప్రకటించింది. జూన్ 16 నాటికి పాస్ బుక్ వచ్చిన రైతులు రైతు బంధు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. భూమి పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ లను స్థానక ఏఈఓలకు ఇవ్వాలని సూచించింది.
మరోవైపు త్వరలో పొడు భూములకు పట్టాలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పట్టాల పంపిణీ అనంతరం వారికి రైతు బంధు కూడా ఇస్తామని ప్రకటించింది.












Click it and Unblock the Notifications