వామ్మో .. మందుతాగి బస్సు నడిపిన డ్రైవర్
మహబూబాబాద్ : ఆర్టీసీ ప్రగతి రథ చక్రాల కొందరు చోదకులు అదుపుతప్పుతున్నారు. స్టడీగా, స్టేబుల్ గా ఉండాల్సిన డ్రైవర్లు మత్తులో జోగుతున్నారు. తాగి, తూళ్లుతూ మరీ బస్సు నడిపిస్తూ ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో ఓ డ్రైవర్ మందు తాగి బస్సు నడుపుతున్నాడని ప్రయాణికులు ఆందోళన చేపట్టడం కలకలం రేపుతోంది.
తూళుతూ డ్రైవ్ ..
సూర్యాపేట డిపోకు చెందిన అద్దె బస్సు సూర్యాపేట వయా దంతాలపల్లి మీదుగా వేములవాడ వెళుతుంది. బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు సూర్యాపేట జిల్లా నిమ్మకల్ వద్దకు రాగానే డ్రైవర్ చారి బస్సు నిలిపి ఓ ఇంట్లోకి వెళ్లి మద్యం తాగి వచ్చాడు. దీంతో మహబూబాబాద్ జిల్లా గున్నేపల్లి స్టేజీ సమీపంలో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు.

మరో బస్సులో పంపించారు ..
తర్వాత బస్సును తూలుతూ నడపడంతో ప్రయాణికులు డ్రైవర్ ను ప్రశ్నించారు. ఆయన పొంతనలేని సమాధానం చెప్పడంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. దీంతో కండక్టర్ వారిని మరో బస్సులో పంపించారు. తర్వాత చేసేదిమిలేక డ్రైవర్, కండక్టర్ బస్సుతోపాటు సూర్యాపేట డిపోకు తీసుకెళ్లారు.












Click it and Unblock the Notifications