TSRTC: మహిళలకు టీఎస్ ఆర్టీసీ షాక్.. ఇక నుంచి ఆ బస్సుల్లో ఛార్జీల వసూల్..!

తెలంగాణ ప్రభుత్వ మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు భారీగా వాడుకుంటున్నారు. బస్సుల్లో తెగ ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం మహిళలకు ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అవకాశం ఉంది. ఇక సిటీ బస్సుల విషయానికొస్తే ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ లో ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఉచితం ఉంది కదా అని చాలా మంది మహిళలు అనవసరంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ముఖ్యంగా దూరం వెళ్లే ఎక్స్ ప్రెస్ ల్లో ఎక్కి ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆర్టీసీ అధికారులు మహిళలకు విజ్ఞప్తులు చేశారు. అనవసరంగా ఎక్స్ ప్రెస్ లు ఎక్కొద్దని కోరారు. పల్లె వెలుగు బస్సులు వాడుకోవాలని సూచించారు. అయితే మహిళలకు ప్రత్యేక బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించారు. మొన్న సంక్రాంతికి ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఈసారి మేడారం కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది.

RTC officials have proposed to collect Charges for women in special buses run to Medaram Jatara

ఈ ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని చాలా భావించారు. కానీ ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని తొలగించి ఛార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. ఇటీవల రవాణా శాఖ బడ్జెట్ పై చర్చించడానికి డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు వసూలు చేయడం వల్ల కాస్త ఆదాయం పెరుగుతోందని అధికారులు ప్రతిపాదిచారు.

భట్టి అధికారుల ప్రతిపాదనను తిరస్కరించారు.మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు.మేడారం సహా ఏ జాతరకైనా మహిళలకు ఛార్జీలు వసూలు చేయొద్దని స్పష్టం చేశారు. ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తేల్చి చెప్పారు. ఆర్టీసీ మేడారం జాతరకు భారీగా ప్రత్యేక బస్సులు నడపనుంది. ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. మేడారం జాతర కోసం ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులు నడపనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+