ఉద్యమం రమ్మంది, ఉద్యోగం పోయింది.,ఆసరా కోసం ఎదురుచూపు
సిద్దిపేట . తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఓ ఆర్ టి సి కార్మికుడి ఉద్యోగం ఊడింది. ఉద్యోగం లేక ..భార్య పిల్లలకు ముఖం చూపలేక.....తిరుగుతున్నారు. . తన దీనగాధను చెప్పుకొనేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.తనకు ఆసరా కల్పించాలని కోరుతున్న ఓ వ్యక్తి దీనగాథ ఇది.
కరీంనగర్ జిల్లా కోనరావు పేట మండలం నిజమాబాద్ కు చెందిన వనపర్తి విద్యాసాగర్ 1988 లో కడప బస్ డిపో లో చేరాడు .ఇక్కడ సెక్యూరిటీ గార్డుగాపనిచేసేవాడు.అక్కడ కొంత కాలం పనిచేసిన తర్వాత అనంతపూర్ కు బదిలీ పై వెళ్ళాడు.అక్కడి నుండి జగిత్యాల డిపోకు బదిలీపై వచ్చారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో కెసిఆర్ ను స్పూర్తిగా చేసుకొని ఆయన ఉద్యమం సాగించాడు.
కెసిఆర్ స్పూర్తిగా ఉద్యమం సాగించాడు. ఉద్యోగం చేస్తూనే స్వరాష్ట్రం వచ్చేవరకు అఖండ అయ్యప్పమాలను స్వీకరించారు. ప్రతి ఏటా పాదయాత్రగా శబరిమాల వెళ్ళేవాడు.దీని కోసం తన వ్యవసాయ భూమిని భార్య మెడలో పుస్తెల తాడును కూడ అమ్మాడు.విషయం తెలుసుకొని టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ ఆయనను సన్మానించారు.

తెలంగాణ ఉద్యమంలో విద్యాసాగర్ పాల్గొనడం గిట్టని ఓ అధికారి ఆయనను విధుల నుండి తొలగించారు. దీంతో ఆయన తన భాదనను తెలంగాణ ఉద్యమనేత కెసిఆర్ కు చెప్పారు.కెసిఆర్ చొరవతో మెట్ పల్లి 2 డిపో లో సెక్యూరిటీ గార్డుగా విధుల్లో చేరారు. కాని...మళ్ళీ ఉద్యమంలో పాల్గొంటున్నారనే కారణంగా ఆరు మాసాల్లోనే ఆయనను విధుల నుండి తొలగించారు.
దీంతో ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక ఆయన తిరుగుతున్నారు. దసరా రోజున సిద్దిపేట జిల్లాను సిఎం ప్రారంభిస్తారని తెలుసుకొన్న అక్కడకు చేరుకొన్నారు. కాని...సిఎం ను కలవడం ఆయనకు సాధ్యపడలేదు.ఇతర ప్రజాప్ర్రతినిధులను కలవడం కూడ కుదరలేదు. సిద్దిపేటలోని అయ్యప్ప దేవాలయంలోనే కాలం వెళ్ళదీస్తున్నారు. తన భాదను సిఎంకు చెప్పుకోవాలని ఆశపడుతున్నారు.
ఆర్ టి సి లో ఓ ఉన్నతాధికారి వల్ల తన ఉద్యోగం ఊడింది. టిఆర్ఎస్ ప్రభుత్వం తన భాదను అర్థం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు.తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించాలని ఆయన ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు.తన కుటుంబాన్ని తనను రక్షించాలని అర్థిస్తున్నారు.












Click it and Unblock the Notifications