Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం కేసీఆర్ కు సోషల్ మీడియాలో కొత్త లెక్కలు చెప్తున్న ఆర్టీసీ కార్మికులు: వైరల్ అవుతున్న పోస్టులు

ఆర్టీసీ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరింది. అయినా ప్రభుత్వ వైఖరి మాత్రం దున్నపోతు మీద వాన కురిసిన చందంగానే ఉంది. ప్రతిరోజు ఆందోళనలతో ఆర్టీసీ కార్మికులు తమ నిరసన తెలియజేస్తున్నా అవేమీ పట్టనట్టు ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కార్మికుల తొలగింపుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలిచి పోరాటం సాగిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె ను మరింత ఉధృతం చేయడానికి కార్యచరణ రూపొందిస్తున్నాయి.

నష్టాల్లో ఉన్న రాష్ట్రంలో సీఎం ను తొలగించాల్సిందే .. పోస్ట్ వైరల్

నష్టాల్లో ఉన్న రాష్ట్రంలో సీఎం ను తొలగించాల్సిందే .. పోస్ట్ వైరల్

ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ నష్టాల్లో ఉంటే, సమస్యలు తీర్చమని ప్రశ్నించినందుకు, నష్టాల నుండి గట్టెక్కించమని కోరినందుకు ఆర్టీసీ కార్మికుల తొలగింపు నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. ఇక అలాంటప్పుడు ఒకప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో లోటు బడ్జెట్ రాష్ట్రంగా మారింది. ప్రస్తుతం అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో సీఎం కేసీఆర్ ను కూడా తొలగించాల్సిందే అంటూ సోషల్ మీడియా వేదికగా కొత్త లెక్క చెప్పి వైరల్ చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు.

మహిళా ఆర్టీసీ కార్మికులపై పోలీసుల ప్రవర్తనపై సోషల్ మీడియాలో పాట వైరల్

మహిళా ఆర్టీసీ కార్మికులపై పోలీసుల ప్రవర్తనపై సోషల్ మీడియాలో పాట వైరల్


ఇక అంతే కాదు వరంగల్ లో మహిళా ఆర్టీసీ కార్మికుల పై పోలీసులు ప్రవర్తించిన తీరు, మహిళ చీర కొంగు లాగుతూ పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం వెరసి కెసిఆర్ పాలన పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ ఘటనను పాట రూపంలో తయారుచేసి దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అంటూ ప్రచారం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఫేస్ బుక్ లో చూసిన వాట్సప్ స్టేటస్ లో చూసిన ఈ పాటనే పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఏం జరిగినా బెట్టు వీడని కేసీఆర్ .. మేమూ అంతే అంటున్న ఆర్టీసీ కార్మికులు

ఏం జరిగినా బెట్టు వీడని కేసీఆర్ .. మేమూ అంతే అంటున్న ఆర్టీసీ కార్మికులు

ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ మాత్రం ఒక మెట్టు కూడా కిందకి దిగడం లేదు. తన బెట్టు వీడటం లేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం హుజురాబాద్ ఉప ఎన్నిక మీద పడుతుంది అని తెలిసినా సరే ఏ మాత్రం తగ్గటం లేదు. తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎం కేసీఆర్ తేల్చి చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆర్టీసీ కార్మికులు సైతం సీఎం కేసీఆర్ తమ డిమాండ్లకు తలొగ్గి తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేసి తీరుతామని చెప్తున్న పరిస్థితి.

ఎంతకైనా తెగిస్తాం .. మా డిమాండ్స్ సాధించుకుంటాం అంటున్న కార్మికులు

ఎంతకైనా తెగిస్తాం .. మా డిమాండ్స్ సాధించుకుంటాం అంటున్న కార్మికులు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు చేసిన పోరాట స్ఫూర్తిని గుర్తుచేసుకొని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తమ సమస్యల సాధన కోసం, తమ ఉద్యోగ భద్రత కోసం ఆర్టీసీ కార్మికులు ఎంతవరకైన తెగిస్తాము అని మొత్తం రెండు లక్షల మంది ఆర్టీసీ కార్మిక కుటుంబాలు త్యాగాలకు వెనుదీయమని తేల్చి చెబుతున్న పరిస్థితి. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని పంతాన్ని వీడకుంటే ప్రజా వ్యతిరేకత తారా స్థాయికి చేరేలా ఉంది. అందుకు సోషల్ మీడియా వేదికగా మారేలా ఉంది. ఫలితం సీఎం కేసీఆర్ కు ప్రతికూలంగా వచ్చేలా ఉంది. మరి గులాబీ బాస్ ఆలోచన ఏంటో లోగుట్టు పెరుమాళ్ళకెరుక.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+