Shocking Video: చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న యువకుడు.. వెనుకనుంచి రైలు వచ్చి..

నేటికాలం ప్రజలు డిజిటల్, సోషల్ మీడియాకు విపరీతంగా అలవాటు పడిపోయారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి అర్ధరాత్రి వరకు ఫోన్ లతోనే గడుపుతున్నారు. సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా పేరు ఏదైనా చిన్నా పెద్దా అని తేడా లేకుండా సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోతున్నారు. అటు బహిరంగ ప్రదేశాల్లోనూ యువత ఇలాగే ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపై ముందు చూడకుండా చెవుల్లో ఇయర్ ఫోన్స్.. కళ్లు సెల్ ఫోన్ పై పెట్టి ఏదో లోకంలో విహరించినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి పనులు వారి ప్రాణాలతో పాటు తోటి వారి ప్రాణాలకు కూడా ముప్పేనన్న విషయాన్ని వాళ్లు గ్రహించడం లేదు.

తాజాగా హైదరాబాద్‌ సమీపంలోని బొల్లారంలో షాకింగ్ ఘటన జరిగింది. చెవిలో ఇయర్​ఫోన్లు పెట్టుకొని, రైలు పట్టాల వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటనపై హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన హృదయవిదారక వీడియోను ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 'మీ ప్రాణం కంటే ఒక ఫోన్ కాల్ ముఖ్యమా..? ఇంట్లో మీ కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యుల కంటే పాటలే అంత ముఖ్యమా?' అని సోషల్​ మీడియా వేదికగా ప్రజలను ప్రశ్నించారు.

Sajjanar Earphones can be life-threatening shares a video of a horrific accident emotional post X

ఆధునికత పేరుతో చెవులకు తగిలించుకుంటున్న ఇయర్‌ఫోన్లు వినోదాన్ని పంచుతున్నాయా..? లేక కళ్లముందే పొంచి ఉన్న మృత్యువు కేకను కూడా వినిపించకుండా ప్రాణాలను కబళించే మాయా తెరగా మారుతున్నాయా..? అని ప్రశ్నించారు. నిండు జీవితం కంటే ఆ ఫోన్ కాల్ అంత అత్యవసరమా.. ఇంట్లో ఎదురుచూసే కుటుంబ సభ్యుల కంటే ఆ పాటలు అంత ముఖ్యమైనవా..? ఒక్కసారి ఆలోచించండి.. అని కీలక విజ్ఞప్తి చేశారు. క్షణకాలం ఏమరుపాటు, మితిమీరిన అజాగ్రత్త బతికుండగానే నిండు జీవితాన్ని ఎలా ముగింపునకు తెస్తుందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదని తెలిపారు. చెవుల్లో దూరిన ఆ పరికరాలు చుట్టూ ఉన్న ప్రపంచంతో ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెంచేసి, సమీపిస్తున్న ప్రమాద ఘంటికలను సైతం వినిపించకుండా చేస్తున్నాయని అన్నారు.

అలాగే బైక్‌ లు, కార్లు డ్రైవ్ చేస్తూ ఇయర్‌ ఫోన్లలో మాట్లాడటం లేదా సంగీతం వినడం వల్ల పరిసరాల స్పృహ కోల్పోయి, వెనుక వచ్చే వాహనాల హారన్లు గానీ, అత్యవసర అంబులెన్స్ సైరన్లు గానీ వినబడక తమ ప్రాణాలకే కాకుండా తోటి వాహనదారుల ప్రాణాలకూ ముప్పు తెచ్చిపెడుతున్నారని సీవీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. కాస్త ఆలోచించండి, బాధ్యతగా మెలగండి, నిండు ప్రాణాలను నిర్లక్ష్యానికి బలివ్వకండి.. మీ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మీ కుటుంబాన్ని గుర్తుంచుకోండి.. అని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+