Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సజ్జనార్ మార్క్ ... ఆర్టీసీ సేవలపై పాట పాడిన మొగులయ్యకు సన్మానంతో పాటు బంపర్ ఆఫర్

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సజ్జనార్ తన మార్క్ నిర్ణయాలతో ఆర్టీసీని ప్రగతిపధంలో దూసుకుపోయేలా చేస్తున్నారు.గతంలో ఆర్టీసీ గురించి పెద్దగా పట్టించుకోని జనం ఇప్పుడు సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆర్టీసీ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆర్టీసీని ప్రక్షాళన చేయడంతో పాటుగా, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించటం కోసం సజ్జనార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీలో ఉన్న ప్రతి చిన్న సమస్యను పరిష్కరించటంపై ఫోకస్ పెట్టారు.

ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ మార్క్

ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ మార్క్

ఇప్పటికే ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీ ప్రాంగణాలను శుభ్రంగా తీర్చి దిద్దడంతో పాటుగా, గుట్కాలు, పాన్లు నమిలి ఎక్కడబడితే అక్కడ ఉమ్మి వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆర్టీసీ ప్రక్షాళన కోసం ప్రజలు ఇస్తున్న సూచనలను తీసుకుని వెంట వెంటనే పరిష్కరించే ప్రణాళికలు రూపొందించారు. ఆర్టీసీలో ఉన్న చిల్లర సమస్యను అత్యంత వేగంగా పరిష్కరించారు. ఇక ఆన్లైన్ ద్వారా కూడా ఆర్టీసీ మెరుగైన సేవలు అందించడానికి తగిన చర్యలు తీసుకున్నారు.

బస్సుల్లో మహిళల ఇబ్బందులపై దృష్టి, డ్రైవర్ లకు ఆదేశాలు

బస్సుల్లో మహిళల ఇబ్బందులపై దృష్టి, డ్రైవర్ లకు ఆదేశాలు

అంతేకాదు ఆర్టీసీలో ప్రయాణం చేసే మహిళల ఇబ్బందులపై కూడా దృష్టిసారించిన సజ్జనార్ పలు కీలక సూచనలు ఇచ్చారు. రాత్రి సమయాల్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే మహిళలు అత్యవసర సమయాల్లో బస్సులు ఎక్కడైనా నిలుపవచ్చు అంటూ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. రాత్రిపూట మహిళా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా టోల్ ప్లాజా వద్ద ఉన్న సదుపాయాలను వినియోగించుకునే విధంగా డ్రైవర్లు బస్సులో ఎనౌన్స్ చేయాలని, దూర ప్రాంతాల ప్రయాణికుల కోసం దాబాలు, హోటల్స్ వద్ద బస్సులను ఆపాలని ఉత్తర్వులిచ్చారు. ఇక బస్సులలో సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడం కోసం, ఏకంగా ఆయన బస్సులో ప్రయాణం చేసి ప్రయాణికులతో మాట్లాడి వారి ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని, సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు.

కిన్నెర మొగులయ్యకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ

కిన్నెర మొగులయ్యకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ

అంతేకాదు ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకుని వివాహాలు చేసుకునే వారికి బంపర్ ఆఫర్లు ఇవ్వడంతోపాటుగా, ఆర్టీసీకి విస్తృత ప్రచారం కల్పించడం కోసం తగిన చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలో పాట పాడిన కిన్నెర కళాకారుడిగా ఫేమస్ అయిన మొగులయ్యకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసేలా సజ్జనార్ మొగులయ్య కు ఆఫర్ ఇచ్చారు. ఆయనను ఘనంగా సన్మానించారు.

 ఆర్టీసీపై ఆశువుగా పాడిన పాటకు మంచి రెస్పాన్స్ తో మొగులయ్య కు ఆఫర్

ఆర్టీసీపై ఆశువుగా పాడిన పాటకు మంచి రెస్పాన్స్ తో మొగులయ్య కు ఆఫర్

ఆర్టీసీని అవమానించేలా ఎవరు ఏం చేసినా ఊరుకోబోమని ఇటీవల ర్యాపిడో సంస్థకు, అల్లు అర్జున్ కు వారు చేసిన యాడ్ పై నోటీసులు ఇచ్చిన సజ్జనార్ ఆర్టీసీని కొనియాడితే అంతే ఆదరణ ఉంటుందని చూపించారు. ఇటీవల కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య ఆర్టీసీ సేవలను కొనియాడుతూ ఆర్టీసీ బస్సు ముందు నిలబడి ఆశువుగా పాడిన పాటకు సామాజిక మాధ్యమాలలో మంచి స్పందన రావడంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్ భవన్ లో మొగులయ్య ను సన్మానించారు. తెలంగాణ ఆర్టీసీకి ప్రచారం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీని కొనియాడుతూ పాడిన పాటతో మొగులయ్యను సన్మానించిన సజ్జనార్

ఆర్టీసీని కొనియాడుతూ పాడిన పాటతో మొగులయ్యను సన్మానించిన సజ్జనార్

ఇటీవల తన కూతురు వివాహానికి మొగులయ్య ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నారు. ఆ సమయంలో కిన్నెర మొగులయ్య సమాజంతో బస్సులకు పెనవేసుకున్న బంధాన్ని వర్ణిస్తూ ఆర్టీసీ సేవలను ప్రశంసిస్తూ కిన్నెర వాయిద్యంతో మంచి పాట పాడారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పలువురు ఈ వీడియోని టిఎస్ ఆర్టిసి అధికారిక ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేశారు. ఆర్టీసీ గురించి సానుకూల ప్రచారం చేసినందుకుగాను మొగులయ్యను సన్మానిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+