సలార్ సాంగ్ : సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వీడియోతో ఆసక్తికర ట్వీట్!!

ప్రభాస్ నటించిన సలార్ సీజ్ ఫైర్ సినిమా దేశవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన సినిమాలన్నీ ఊహించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో నిరాశలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒక్కసారిగా సలార్ సీజ్ ఫైర్ సినిమా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఇటీవల కాలంలో పాన్ ఇండియా మూవీలతో దూసుకుపోతున్న ప్రభాస్ సలార్ లో సరికొత్తగా కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కత్తిపట్టి ఊచకోత కోయడాన్ని ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమాలో మరో హీరో పృధ్వీరాజ్ తో ప్రభాస్ స్నేహం గురించి సాగే సూర్యుడే గొడుగు పట్టి అనే పాట సినిమా రిలీజ్ కంటే ముందే సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

మంచి పాపులారిటీ సాధించిన ఈ సాంగ్ పొలిటికల్ లీడర్లు తెగ వాడేస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సలార్ సినిమా పాటతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగపూర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ, తనపై ఆసక్తికర వీడియో షేర్ చేశారు.

Salaar Song: CM Revanth Reddy, Rahul Gandhi interesting tweet with video!!

అక్కడ ఆయనకు దొరికినటువంటి అపూర్వమైన ఆహ్వానంతో పాటు, అగ్ర నాయకుడు రాహుల్ గాంధీతో తనకు ఉన్నటువంటి సంబంధాన్ని అనుబంధాన్ని తెలియజేసే విధంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టుకు బ్యాక్ గ్రౌండ్ గా సలార్ సినిమాలోని ప్రభాస్ తో స్నేహం గురించి సాగే పాట పెట్టారు. అంతేకాదు ఆ పాటలోని కొన్ని లిరిక్స్ కూడా రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

రాహుల్ గాంధీని, తనను కలిపి రేవంత్ రెడ్డి పెట్టిన పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తిని కలిగిస్తుంది. రేవంత్ రెడ్డి పెట్టిన పోస్టులో వేగమొకడు...త్యాగమొకడు గతము మరువని గమనమే అంటూ పేర్కొన్నారు. ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకరు గర్జన... ఒకరు ఉప్పెన వెరసి ప్రళయాలే అని పేర్కొన్నారు. సైగ ఒకరు...సైన్యం ఒకరు కలిసి కదిలితే కదనమే అంటూ రాహుల్ గాంధీని, తనను ఉద్దేశించి రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+