సొంత యాప్ స్టోర్: తెలంగాణలో సామ్‌సంగ్ అకాడమీ, ఆ మూడూ..

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సామ్‌సంగ్ తెలంగాణ రాష్ట్రంలో తన అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం తెలిపారు. రాష్ట్రంలోని ఔత్సాహిక విద్యార్థుల ఆవిష్కరణలపై పెద్ద ఎత్తున ఆసక్తిని కనబరిచి సామ్‌సంగ్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

సోమవారం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), సామ్‌సంగ్ ఆధ్వర్యంలో బేగంపేట టాస్క్ కార్యాలయంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సామ్‌సంగ్‌కు చెందిన టైజన్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్‌పై యాప్‌కు రూపకల్పన చేసిన ఔత్సాహికులకు బహుమతులు అందించారు.

టాస్క్-సామ్‌సంగ్ సంయుక్తంగా టైజన్ ఆపరేటింగ్ సిస్టంపై 500 విద్యార్థులకు యాప్స్ రూపకల్పనలో శిక్షణ ఇచ్చారు. వారిలో తొంబై మంది కొత్తగా యాప్స్‌ను రూపొందించి టైజన్ స్టోర్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ యాప్‌లలో పదమూడు యాప్‌లను పరిశీలించిన సామ్‌సంగ్ అత్యుత్తమ ప్రతిభ చూపిన మొదటి ముగ్గురికి న్యూజనరేషన్ ఫోన్లను బహుమతులుగా అందించింది.

టాస్క్

టాస్క్

ఈ ముగ్గురు విజేతలకు టీ హబ్‌లో ఉచితంగా శిక్షణా సదుపాయాన్ని సామ్‌సంగ్ కల్పిస్తుంది. ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన కాలేజీలకు కూడా ప్రశంసాపత్రాలు అందించింది.

 టాస్క్

టాస్క్

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. టాస్క్ ద్వారా నలభై వేలమందికి శిక్షణ ఇవ్వడం సంతోషకరమన్నారు. టైజన్ అకాడమీ ద్వారా సామ్‌సంగ్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

టాస్క్

టాస్క్

టీ హబ్‌తో సామ్‌సంగ్ కుదుర్చుకొన్న ఒప్పందం గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. పరిశోధనలకు ఊతం ఇస్తూ ఉద్యోగాలు కల్పించే వారికోసం టీ హబ్ ఏర్పాటు చేస్తే, ఉద్యోగాల కోసం పోటీపడే వారికి టాస్క్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు.

టాస్క్

టాస్క్

సామ్‌సంగ్ ఉపాధ్యక్షుడు దీపక్ మాట్లాడుతూ.. విద్యార్థుల నైపుణ్యం తమ సంస్థలోని సీనియర్ ఉద్యోగుల స్థాయిలో ఉందన్నారు. విద్యార్థుల ఉత్సాహం, ప్రభుత్వం ప్రోత్సాహం చూసిన తర్వాత టైజన్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

టాస్క్

టాస్క్

కాగా, టాస్క్‌లో శిక్షణ పొందిన విద్యార్థులు రూపొందించిన మూడు యాప్స్ సాంకేతికంగా అత్యుత్తమం కావడం గమనార్హం. భగవద్గీత, ఖురాన్‌ను చదివి వినిపించేలా ఓ యాప్ రూపొందించారు.

 టాస్క్

టాస్క్

గర్లిష్ పేరుతో రూపొందించిన మరో యాప్ అమ్మాయిల సౌందర్య పోషణ టిప్స్‌ను అందిస్తుంది. మూడో యాప్ యమ్మీ ఫుడ్స్ యాప్ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న యాప్‌ల కంటే భిన్నంగా ఉంది.

టాస్క్

టాస్క్

ఈ యాప్‌లో రెస్టారెంట్ల వివరాలు, వాటిల్లో ఉండే మెనూ ఆయా ప్రాంతాలను బట్టి సమాచారం అందిస్తుంది. ఇలాంటి విశిష్టతలు కలిగిన మూడు యాప్‌లను రూపొందించిన ఇంజినీర్లతో మంత్రి ప్రత్యేకంగా ముచ్చటించి అభినందించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Delighted over success of its first Tizen skilling pilot in India, Samsung is keen to work with Telangana to set up a Tizen Academy, a top company official said on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి