నోయిడాలో తెలంగాణ విద్యార్థి సందేశ్ హత్య: వెక్కిరించినందుకే అంత పనిచేశారట
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో నల్లగొండ విద్యార్థి రామరాజు సందేశ్‌ను హత్య చేసిన అమన్, మింటులను పోలీసులు అరెస్టుచేశారు. అమిటీ యూనివర్సిటీలో బీఎస్సీ మెరైన్ సైన్స్ సెకండియర్ చదువుతున్న సందేశ్‌ను ఈ నెల 17న అమన్, మింటు కాల్చిచంపిన విషయం తెలిసిందే.
వారిని అరెస్టు చేసి పోలీసులు విచారించగా సందేశ్ తమను వెక్కిరించినందువల్లనే చంపేశామని తెలిపారు. తాము మాట్లాడే భాష తమాషాగా ఉందంటూ సందేశ్ తన మిత్రులతో కలిసి వెక్కిరించేవాడని.. అందుకే చంపేశామని నిందితులు విచారణలో తెలిపినట్లు నోయిడా పోలీసులు శుక్రవారం వెల్లడించారు.

సందేశ్‌ను తుపాకీతో కాల్చి, ఆపై గొడ్డలితో నరికి అతన్ని కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఘటన అనంతరం నిందితులు పారిపోయారు. నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన సందేశ్ రెండేళ్ల క్రితం నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (మెరైన్ సైన్స్) కోర్సులో చేరారు. తొలి ఏడాది హాస్టల్‌లో ఉండి చదువుకున్న సందేశ్ రెండో సంవత్సరం నుంచి నోయిడా సెక్టార్-100లోని లోటస్ బ్లోవర్డ్ అపార్ట్‌మెంట్‌లో 1804 ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు.
అమిటీ యూనివర్సిటీలో టూరిజం మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్న అమన్, అతని స్నేహితుడు మౌంటీ అదే అపార్ట్‌మెంట్‌లో 1303లో అద్దెకు ఉంటున్నారు. శనివారం సాయంత్రం అమన్, మౌంటీలు సందేశ్ అపార్ట్‌మెంట్ 1804కు వెళ్తున్నట్లు సెక్యూరిటీ వద్ద సంతకం చేసి ఆ బ్లాక్‌లోకి వెళ్లారు.

నేరుగా ఫ్లాట్ వద్దకు వెళ్లి అమన్ కాలింగ్‌బెల్ నొక్కాడు. సందేశ్ తలుపు తీయగానే వెంటనే పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. తనను కాల్చవద్దంటూ సందేశ్ వేడుకున్నా వారు వినలేదు. ఆ తర్వాత మౌంటీ తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో నరికాడని ఆ సమయంలో గదిలో ఉన్న సందేశ్ రూమ్‌మేట్ నదీమ్ వివరించాడు. ఈ ఘాతుకాన్ని అడ్డుకోడానికి వెళ్లిన తనను కూడా కాల్చుతామంటూ బెదిరిస్తూనే గొడ్డలితో నరకడానికి ముందుకు రాగా, లోపలి గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నానని, దాంతో తాను బతికిపోయాయనని తెలిపాడు.












Click it and Unblock the Notifications