సినీ ఇండస్ట్రీపై కుట్ర, ఆ పార్టీ ఐరన్ లెగ్.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సినీ ఇండస్ట్రీపై కుట్ర జరుగుతోందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. సినీ పరిశ్రమపై పగబట్టినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతిని అందరూ ఖండించారన్నారు. శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని తెలిపారు. మృతురాలు రేవతి కుటుంబానికి అందరూ బాసటగా నిలిచారన్నారు.
ఈ సమస్య ముగిసిన తర్వాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడించారని.. సినిమా తరహా కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రణాళిక ప్రకారం అసెంబ్లీ వేదికగా సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేశారని ధ్వజమెత్తారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వ హననం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారన్నారు.

ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ అని బండి సంజయ్ అన్నారు. గతంలో బీఆర్ఎస్‌ను ఎంఐఎం నిండా ముంచిందని.. ఎంఐఎంను నమ్మితే కాంగ్రెస్‌కు కూడా బీఆర్ఎస్ గతే పడుతుందన్నారు బండి సంజయ్. ఎంఐఎంతో కలిసి క్కా ప్రణాళిక ప్రకారం పవిత్రమైన అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోందన్నారు.
మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కలుషిత ఆహారం తిని గురుకుల విద్యార్థులు చనిపోతున్నారనని.. వారి కుటుంబాలను సీఎం రేవంత్ ఏనాడైనా రామర్శించారా? అని ప్రశ్నించారు. ఆ మరణాలకు మీరు బాధ్యత వహించారా? మీకో న్యాయం.. ఇతరులకు మరో న్యాయా? ఇకనైనా రేవంత్ కక్ష సాధింపు చర్యలు వీడాలి అని బండి సంజయ్ హితవు పలికారు.
సినిమా ఓపెనింగ్ రోజు అగ్ర హీరోలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు రావడం 50 ఏళ్లుా షరా మామూలేనని చెప్పారు. పాన్ ఇండియా సినిమా బెన్ ఫిట్ షోకు భారీ ఎత్తున ప్రేక్షకులు రావడం కడూా సాధారణమేనని అన్నారు. ఈ విషయం తెలిసి కూడా ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మాయక మహిళ బలైందని.. ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. ఆ తప్పును ఇతరులపై నెట్టడం సిగ్గు చేటని బండి సంజయ్ విమర్శించారు.












Click it and Unblock the Notifications