తీసుకురండి!: రూ.3 కోట్లపై పోలీసులకు సంగీత సవాల్, లాయర్ల మద్దతు ఇలా
తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు దీక్ష చేస్తున్న మాజీ టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి సతీమణి సంగీత గురువారం కూడా కొనసాగించారు. దీంతో ఆమె నిరసన దీక్ష ఐదో రోజుకు చేరుకుంది.
హైదరాబాద్: తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు దీక్ష చేస్తున్న మాజీ టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి సతీమణి సంగీత గురువారం కూడా కొనసాగించారు. దీంతో ఆమె నిరసన దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. తనకు స్పష్టమైన హామీ వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
చదవండి: సంగీత ఎలా చెప్తే అలా: ఎంపీ మల్లారెడ్డి, 'కసి' వ్యాఖ్యలపై వాగ్వాదం, రూ.3 కోట్ల కొత్తకోణం
Recommended Video

కాగా, బుధవారం సంగీతపై తీవ్ర ఆరోపణలు విన వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసుపో రాచకొండ సీపీ మహేష్ భాగవత్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొత్త విషయం చెప్పారు. సంగీత తన భర్తను రూ.మూడు కోట్లు డిమాండ్ చేస్తోందని, ఆర్థిక విషయాల్లో తమకు సంబంధం లేదన్నారు.
చదవండి: మాజీ టీఆర్ఎస్ నేత ఇష్యూ: 'సంగీత ప్లాన్ ప్రకారమే వచ్చింది, సంపాదించిందేం లేదు'

సంగీత డబ్బులు డిమాండ్ తెలిసింది, కానీ
రూ.3 కోట్లు డిమాండ్ చేసిన విషయం తమకు బుధవారమే తెలిసిందని మహేష్ భాగవత్ అన్నారు. చట్ట ప్రకారం తాము చేసేది చేస్తున్నామన్నారు. అయితే, తాను డబ్బులు డిమాండ్ చేయడం లేదని, తనకు, తన పాపకు రక్షణ కల్పించాలని, తన కూతురు భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నానని సంగీత చెప్పారు.

సాక్ష్యాలు ఉంటే తీసుకురావాలని సవాల్
తాను ఎప్పుడు డబ్బులు డిమాండ్ చేశానో చెప్పాలని సవాల్ విసిరారు. తాను తన అత్తమామలను పిలిపించి మాట్లాడాలని చెబుతున్నానను తప్ప డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు. పోలీసుల వద్ద సాక్ష్యాలు ఉంటే బయటపెట్టాలని, తీసుకు రావాలని సవాల్ విసిరారు.

నన్ను కోడలుగా అంగీకరించాలి
భర్త, ఆ తర్వాత అత్తామామ, మరిదిని అరెస్టు చేసినప్పటికీ గురువారం కూడా సంగీత తన నిరసన కొనసాగించింది. ఈ సందర్భంగా మాట్లాడారు. వారిని అరెస్ట్ చేసినంత మాత్రాన తనకు న్యాయం జరగదని, ఇంటి దగ్గరికి వచ్చి తనను కోడలుగా అంగీకరించాలని సంగీత డిమాండ్ చేస్తోంది.

ఆరోగ్యం క్షీణిస్తోంది, సమస్యకు పరిష్కారం చూపించాలి
నిన్నటి నుంచి జ్వరంతోనే దీక్ష చేస్తున్న సంగీత ఆరోగ్యం క్షీణిస్తుండటంతో త్వరగా సంగీత సమస్యకు పరిష్కారం చూపాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. సంగీత కేసులో పోలీసులు మాత్రం చట్టపరంగా ముందుకు పోతున్నారు.

భర్తతో కలిసి ఉండటం ఆమె ఇష్టం, భరణం ఇప్పిస్తాం
అటు సంగీతకు మహిళా సంఘాలతో పాటు ప్రజా సంఘాలు, న్యాయ నిపుణుల నుంచి కూడా మద్దతు పలుకుతున్నారు. భర్తతో కలసి ఉండాలా, వద్దా అనేది సంగీత ఇష్టమని రిటైర్డ్ జడ్జ్ చంద్రకుమార్ అభిప్రాయపడ్డారు. కలసి ఉండే ఉద్దేశం లేకపోతే భరణం పొందే హక్కుందన్నారు. ఆమెకు ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా అండగా నిలబడతానన్నారు.

సంగీతకు పలువురి మద్దతు
సంగీతను పరామర్శించిన తెలంగాణ ప్రజాసంఘాల నేత విమలక్క... శ్రీనివాస రెడ్డిపై కేసులు నమోదుచే, బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతోందన్నారు. సంగీత విషయంలో ప్రభుత్వం స్పందించాలన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications