మాజీ టీఆర్ఎస్ నేత ఇష్యూ: 'సంగీత ప్లాన్ ప్రకారమే వచ్చింది, సంపాదించిందేం లేదు'
టీఆర్ఎస్ లీడర్, రియాల్టర్ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రెండో భార్య సంగీత ఫిర్యాదుతో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 307, 290, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు మూడ్రోజులుగా భర్త ఇంటి
Recommended Video

హైదరాబాద్: టీఆర్ఎస్ లీడర్, రియాల్టర్ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రెండో భార్య సంగీత ఫిర్యాదుతో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 307, 290, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు మూడ్రోజులుగా భర్త ఇంటి ఎదుట సంగీత ఆందోళన నిర్వహిస్తోంది.
చదవండి: నిత్య పెళ్లి కొడుక్కి టీఆర్ఎస్ షాక్: ఇంటి ముందే సంగీత, 'ఆడపిల్లతో ఎమ్మెల్యే ఇలానా?'

సంగీత ప్లాన్ ప్రకారమే వచ్చింది
శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సమయంలో ఆయన మీడియాతో మాట్లాడాడు. సంగీత ప్లాన్ ప్రకారమే తమ ఇంటికి వచ్చిందని ఆరోపించాడు. ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయి చాలా రోజులు అవుతోందని, అప్పటి నుంచి కాపురానికి రమ్మని ఎంత బతిమాలినా ఫలితం లేకుండా పోయిందన్నారు.

నేను సంపాదించింది ఏమీ లేదు, పేరెంట్స్‌దే
అంతేకాకుండా తనతో పాటు, తన తల్లిదండ్రులపై పలు రకాల కేసులు పెట్టిందని శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. తాను సంపాదించింది ఏమీ లేదని, ఆస్తి అంతా తన తల్లిదండ్రులదేనని చెప్పాడు. సంగీత, ఆమె సోదరుడు తమపై దాడి చేసిన వీడియోలు, తన దగ్గర ఉన్నాయని, త్వరలో వాటిని బయటపెడతానని చెప్పాడు.

కట్నం కోసం కూడా వేధించారు
సంగీత తన భర్త ఇంటి ముందు తన ఆందోళనను కొనసాగిస్తోంది. ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి, మరో ఆరోపణ కూడా చేశారు. తనను కట్నం కోసం కూడా వేధించారని తెలిపారు. తన భర్త తనను ఓ పని మనిషిగా చూశాడన్నారు. తాను చాన్నాళ్లుగా తల్లిదండ్రుల వద్ద ఉంటున్నానని, తనకు తెలియకుండా మూడో పెళ్లి చేసుకోవడంతో న్యాయం కోసం తల్లిదండ్రులతో కలిసి వచ్చానని చెప్పారు.

శ్రీనివాస్ రెడ్డి
కాగా, శ్రీనివాస్ రెడ్డిని పెళ్లి చేసుకున్న మూడో భార్య జగదీశ్వరి సోమవారం ఆయన ఇంటికి వచ్చి, మీడియాతో మాట్లాడి వెళ్లిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ రెడ్డి విషయం వెలుగు చూడటంతో ఆయనపై పార్టీ వేటు వేసింది.

ఎమ్మెల్యే తో మహిళల వాగ్వాదం
సంగీత నిరసన మంగళవారం మూడో రోజుకు చేరుకుంది. న్యాయం చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మహిళలు నినాదాలతో నిరసన తెలిపారు. మూడు రోజులు కావస్తున్నా సంగీతకు న్యాయం జరగలేదంటూ ఆయనతో చెప్పడంతో ఎమ్మెల్యే స్పందించిన తీరుపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్పందన సరిగా లేదంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

క్షీణిస్తున్న్ సంగీత ఆరోగ్యం
మూడో రోజు నిరసన చేపట్టడంతో సంగీత ఆరోగ్యం క్షీణిస్తోంది. తాను ఎన్ని రోజులైనా, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. తనను వేధించిన అత్తామామలను అరెస్టు చేయాలన్నారు. వాళ్లు చేసింది చిన్న తప్పు కాదన్నారు. ఓ ఆడపిల్లను కిరాతకంగా హింసించారన్నారు. తనకు ఎమ్మెల్యే నుంచి హామీ రాలేదని సంగీత అన్నారు.
చదవండి: రిలేషన్‌షిప్ వదిలేస్తా, 20ఏళ్ళ యువతివల్లే చిచ్చు: భార్యని కొట్టిన టీఆర్ఎస్ నేత కేసులో ట్విస్ట్‌లు
చదవండి: టీఆర్ఎస్ నేత లీలలు: నందినికి మూడో యువతి పేరెంట్స్ అండ, 'కూతురిని లోబర్చుకున్నాడు' l
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్












Click it and Unblock the Notifications