శుభవార్త: డ్వాక్రా మహిళలకు చీరల పండుగ అప్పుడే!

తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు పండుగకు చీరల పంపిణీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో త్వరలోనే డ్వాక్రా గ్రూపుల మహిళలకు ఇందిర మహిళా శక్తి సంఘాల పేరుతో ప్రతి సంవత్సరం రెండు చొప్పున చీరలను పంపిణీ చేయనున్నారు.

సిరిసిల్ల నేతన్నలతో మాట్లాడిన సీతక్క
ఇక తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చీరలు తయారీదారులతోను, కార్మికులతో మాట్లాడిన మంత్రి సీతక్క చేనేత కార్మికులకు 365 రోజులు పని కల్పించడం కోసం తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. ప్రభుత్వం నుంచి మరిన్ని ఆర్డర్లు వారికి ఇస్తామని దీనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరుపుతున్నామని సీతక్క పేర్కొన్నారు.

saree festival for Dwcra women good news said minister seethakka

నవంబర్ 19వ తేదీన చీరలను పంపిణీ చేస్తామన్న సీతక్క
చీరలు తయారు చేయడం కోసం సిరిసిల్ల నేత కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్డర్ల కారణంగా నెలకు 25 వేల రూపాయల వరకు వస్తున్నాయని సీతక్క తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు నవంబర్ 19వ తేదీన చీరలను పంపిణీ చేస్తామని సీతక్క శుభవార్త చెప్పారు. అదే రోజు ఇందిరా గాంధీ జయంతి ఉండడంతో, నవంబర్ 19వ తేదీన స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలు అందిస్తామన్నారు.

https://telugu.oneindia.com/news/telangana/congress-baki-card-vs-brs-dhokha-card-election-politics-in-telangana-454957.html

మహిళా సంఘాల సభ్యుల గౌరవం పెంచేలా ఒకే రకం చీరలు
ఏడాదికి రెండు చొప్పున చీరలను వారికి అందించనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘాల సభ్యుల గౌరవం పెంచేలా ఒకే రకం చీరలు ఇవ్వనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో బతుకమ్మ చీరలపైన నిర్ణయం తీసుకొని మహిళలందరికీ ఇచ్చేలా క్యాబినెట్లో చర్చిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తామని సీతక్క తెలిపారు.

త్వరలో ఇందిరమ్మ చీరల రెండో ఆర్డర్
ఇందిరమ్మ చీరల రెండో ఆర్డర్ ను కూడా త్వరలో ఇచ్చేలాగా సీఎం దృష్టికి తీసుకువెళతామని అన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తే కొందరు కోర్టులను ఆశ్రయించారని సీతక్క పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి సీతక్క వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+