Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీం షాక్- కోర్టు ధిక్కారంపై..!

తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఇవాళ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో కోర్టు ధిక్కార చర్యల విషయంలో ఉత్కంఠ నెలకొంది.

రాష్ట్రంలో బీఆర్ఎస్ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడంపై ఆ పార్టీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదులు చేసింది. అయితే వీటిని నిర్ణీత గడువులోగా విచారించి తగు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా చర్యలు తీసుకోకపోవడంతో కోర్టు ధిక్కారానికి స్పీకర్ పాల్పడ్డారంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

SC Summons Telangana Speaker in MLAs Defection Case Issues Contempt Notice

తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తమ ఆదేశాల్ని పాటించకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది. గతంలో ఇదే అంశంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్ తో ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ను కూడా జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.

SC Summons Telangana Speaker in MLAs Defection Case Issues Contempt Notice

ఇప్పటికే తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా కేవలం ఏడుగురిపైనే స్పీకర్ తీర్పు ఇచ్చారు. దీంతో సుప్రీంకోర్టు తాజాగా ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేేసింది. రెండు వారాల్లోగా మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసింది. ఈ మేరకు ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు 8 వారాల గడువు ఇవ్వాలన్న స్పీకర్ కార్యాలయం విజ్ఞప్తిని సైతం తోసిపుచ్చింది. అయితే స్పీకర్ కంటికి ఆపరేషన్ చేయించుకోవడం, అసెంబ్లీ సమావేశాల వంటి కారణాలతో గడువు పెంచాలని కోరగా. 2 వారాల విచారణలో పురోగతి చూపిస్తే నాలుగు వారాలు ఇస్తామని సూచించింది. ఇప్పుడు గత డెడ్ లైన్ ఉల్లంఘన విషయంలో కోర్టు ధిక్కార చర్యలపై నోటీసు జారీ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+