దారుణం: బడికి వెళ్తున్న బాలికను ఎత్తుకెళ్లి రేప్ చేశాడు
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం ఎల్లగందుల ఖిల్లాలో శనివారం రాత్రి ఘోరం జరిగింది. ఓ బాలిక(13)పై దుర్గం అనిల్ (22) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం ఎల్లగందుల ఖిల్లాలో శనివారం రాత్రి ఘోరం జరిగింది. ఓ బాలిక(13)పై దుర్గం అనిల్ (22) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కరీంనగర్ రూరల్ ఏసీపీ తిరుపతి తెలిపిన ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
కొక్కెరకుంట గ్రామానికి చెందిన బాలిక కొత్తపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శనివారం ఉదయం పాఠశాలకు వెళ్తున్న బాలికను ఇదే గ్రామానికి చెందిన దుర్గం అనిల్, అతడి ఇద్దరు స్నేహితులు శ్రీకాంత్, సోమేశ్వర్ అటకాయించి బైక్‌పై ఎలగందల్ ఖిల్లాకు తీసుకుని వెళ్లారు.

అనిల్ బాలికపై అత్యాచారానికి పాల్పడగా ఇద్దరు స్నేహితులు సహకరించారు. అనంతరం బాలికను పాఠశాల వద్ద వదిలి వెళ్లారు. ఇంటికి చేరిన బాలిక విషయాన్ని బయటకు చెప్పలేదు. ఆదివారం ఉదయం బాలిక పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు ప్రశ్నించారు. దాంతో అసలు విషయం తెలిపింది.
దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అనిల్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోని తీసుకుని విచారిస్తున్నారు. అనిల్‌పై అత్యాచారం, ఫోక్స్, సోమేశ్వర్‌పై ఫోక్స్, కిడ్నాప్, శ్రీకాంత్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటితో పాటు ఫోక్స్, కిడ్నాప్ కేసులు సమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం కరీంనగర్ ప్రధానాసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications