తెలంగాణలో స్కూల్ టైమింగ్స్‌లల్లో కీలక మార్పులు- కొత్త సమయం ఇదే
హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలల సమయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రోజువారీ సమయాల్లో మార్పులు చేసింది ప్రభుత్వం. తల్లిదండ్రుల నుంచి అందుతోన్న విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాలల సమయాలను విద్యార్థులకు మరింత అనుకూలంగా సవరించింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లను మినహాయించింది. జంటనగరాల్లో ఇప్పుడున్న వేళలే కొనసాగుతాయి.
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల రోజువారీ సమయాన్ని పొడిగించింది. ఈ మేరకు పాఠశాల విద్యా మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఏ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఉన్నత పాఠశాలలు 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తున్నాయి.

ఇందులో మార్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాన్ని 9 నుంచి 9:30 గంటల వరకు పొడిగించింది. ఇకపై 9:30 గంటలకు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభమౌతాయి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:15 నిమిషాల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 నిమిషాల వరకు పని చేస్తాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. జంటనగరాల్లో ప్రస్తుతం ఉన్న టైమింగ్స్ యధాతథంగా కొనసాగుతాయి. ఇందులో మార్పులు చేయలేదని పాఠశాల విద్యా మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో గల ప్రాథమిక విద్యా శాఖ రీజినల్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులకు ఉత్తర్వులను జారీ చేసింది.












Click it and Unblock the Notifications