కిచెన్‌లో డ్రగ్స్ తయారుచేస్తోన్న సైంటిస్ట్ అరెస్టు
సికింద్రాబాద్ : ఇంట్లోనే డ్రగ్స్ తయారుచేస్తూ.. కోట్ల రూపాయల ఎగుమతులు చేస్తోన్న ఓ శాస్త్రవేత్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ ప్రాంతానికి రాజశేఖర్ అనే శాస్త్రవేత్త ఇంటి కిచెన్ లోనే ఓ ల్యాబ్ ను ఏర్పాటు చేసుకుని యాంఫెటమైన్ అనే డ్రగ్ ను తయారుచేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

ఈ మేరకు సికింద్రాబాద్ లోని అతని అద్దె ఇంటిపై దాడి చేసిన పోలీసులు అతని వద్ద నుంచి 230 కిలోల డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోనే డ్రగ్ తయారుచేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. బెంగుళూరు కు చెందిన వెంకట రామారావు దంపతులు కూడా ఇటీవలే డ్రగ్ తయారుచేస్తూ పోలీసులకు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. వారినుంచి 230కిలోల యాంఫెటన్ డ్రగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications