నాంపల్లి నుంచి అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు

Special Trains: కర్ణాటకలోని కలబురగిలో హజరత్ ఖ్వాజా సయ్యద్ బందె నవాజ్ షరీఫ్ దర్గా ఉర్సు వైభవంగా ఆరంభం అయ్యాయి. దర్గా 621వ ఉత్సవాలు ఇవి. దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు. ఛాదర్లు సమర్పించుకుంటోన్నారు.

ఈ నెల 14వ తేదీన ఉర్సు ఆరంభమైంది. 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ఉర్సుకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు నాంపల్లి నుంచి ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు. ఇవన్నీ కూడా అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు కావడం వల్ల సాధారణ ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటోంది.

SCR arranged unreserved special train to Kalaburagi from Hyderabad

16, 17 తేదీల్లో ఉదయం 7 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరిన నంబర్ 07178 ప్రత్యేక రైలు.. మధ్యాహ్నం 12:30 నిమిషాలకు కలబురగికి చేరుకుంటుంది. ఇవే తేదీల్లో సాయంత్రం 6 గంటలకు కలబురగి నుంచి బయలుదేరే నంబర్ 07177 ప్రత్యేక రైలు రాత్రి 11:55 నిమిషాలకు నాంపల్లికి చేరుకుంటుంది.

బేగంపేట్, సనత్ నగర్, హఫీజ్ పేట్, లింగంపల్లి, నాగలాపల్లి, శంకర్ పల్లి, గుళ్లగూడ, చిట్గిద్ద, వికారాబాద్, గోదామ్ పురా, ధర్పూర్, రుక్మాపూర్, తాండూర్, మంథట్టి, నావద్గీ, కుర్గుంట, సేడం, మల్ఖైద్ రోడ్, చిత్తాపూర్, వాడి మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఇవన్నీ కూడా అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు కావడం వల్ల సాధారణ ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటోంది.

కలబురగి హజరత్ ఖ్వాజా బందె నవాజ్ షరీఫ్ దర్గా ఉర్సును దర్శించడానికి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివెళ్తుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. తెలంగాణ సరిహద్దు జిల్లాల ప్రజలు దర్గాను దర్శించుకుని ఛాద్దర్లు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+